Share News

రష్యాలోని కీలక రిఫైనరీపై ఉక్రెయిన్‌ దాడి

ABN , Publish Date - Aug 14 , 2026 | 06:11 AM

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మరింత ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న చమురు రంగాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఉక్రెయిన్‌ సైన్యం తన దాడులను...

రష్యాలోని కీలక రిఫైనరీపై ఉక్రెయిన్‌ దాడి

  • కీవ్‌పై 133 డ్రోన్లతో రష్యా ప్రతీకార దాడులు

కీవ్‌, ఆగస్టు 13: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మరింత ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న చమురు రంగాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఉక్రెయిన్‌ సైన్యం తన దాడులను తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా, సరిహద్దుకు సుమారు 1,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రధాన రిఫైనరీపై గురువారం ఉక్రెయిన్‌ డ్రోన్‌లు విరుచుకుపడ్డాయి. ‘గాజ్‌ప్రోమ్‌ నెఫైఖిమ్‌ సాలావత్‌’ చమురు శుద్ధి, పెట్రోకెమికల్‌ సముదాయంపై డ్రోన్లతో దాడులు చేశామని ఉక్రెయిన్‌ సైన్యం టెలిగ్రామ్‌ వేదికగా వెల్లడించింది. మాస్కో చమురు పరిశ్రమను దెబ్బతీయడమే లక్ష్యంగా కీవ్‌ మూడు రోజుల్లో చేపట్టిన నాలుగో దాడి ఇది. మరోవైపు రష్యా కూడా ఉక్రెయిన్‌పై బాలిస్టిక్‌ క్షిపణులు, జెట్‌ డ్రోన్లు, గ్లైడ్‌ బాంబులతో విరుచుకుపడుతోంది. బుధవారం నుంచి గురువారం రాత్రి వరకు ఉక్రెయిన్‌ వ్యాప్తంగా 133 డ్రోన్లతో జరిపిన దాడుల్లో నలుగురు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

ఈ వార్తలు కూడా చదవండి

డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..

అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..

Updated Date - Aug 14 , 2026 | 06:17 AM