Share News

రష్యా ఇంటర్నేషనల్ వాంటెడ్ లిస్ట్‌లో టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ డురోవ్

ABN , Publish Date - Jul 29 , 2026 | 05:00 PM

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ ఫౌండర్ పావెల్ డురోవ్‌కు రష్యా ఊహించని షాక్ ఇచ్చింది. ఉగ్రవాదానికి సహకరిస్తున్నారనే కారణంతో పావెల్‌ను ఇంటర్నేషనల్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది.

రష్యా ఇంటర్నేషనల్ వాంటెడ్ లిస్ట్‌లో టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ డురోవ్
Pavel Durov

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ ఫౌండర్ పావెల్ డురోవ్‌కు రష్యా ఊహించని షాక్ ఇచ్చింది. ఉగ్రవాదానికి సహకరిస్తున్నారనే కారణంతో పావెల్‌ను ఇంటర్నేషనల్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది. ఈ విషయాన్ని రష్యా మెయిన్ డొమస్టిక్ సెక్యూరిటీ ఏజెన్సీ బుధవారం స్వయంగా వెల్లడించింది. సెక్యూరిటీ ఎజెన్సీ తెలిపిన వివరాల మేరకు.. రష్యాలో దాడుల కోసం ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఎజెన్సీలు, టెర్రరిస్టు గ్రూపులు టెలిగ్రామ్‌ను అధికంగా వాడుతున్నాయి.


సైబర్ నేరాలు, భారీ సంఖ్యలో హత్యలు, టెర్రరిజం కోసం వ్యూహరచన, వాటి అమలు కోసం టెలిగ్రామ్‌ను అడ్డాగా మార్చుకున్నాయి. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఎజెన్సీలు, టెర్రరిస్టులు ఉపయోగిస్తున్న పలు ఛానళ్లను, చాట్స్, బాట్స్‌ను తొలగించమని రష్యా టెలిగ్రామ్‌కు చాలా రోజుల క్రితమే రష్యా ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ ఆదేశాలను టెలిగ్రామ్ పట్టించుకోలేదు. దీంతో రష్యా చర్యలు చేపట్టింది. ఉగ్రవాదానికి సహకరిస్తున్నారన్న కారణంతో పావెల్‌ను ఇంటర్నేషనల్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది. టెలిగ్రామ్ సేవలను దేశంలో నిలిపివేసింది.


ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు టెలిగ్రామ్‌ను దాడులకే కాకుండా.. ఒక కొత్త రకం రిక్రూట్‌మెంట్‌కు వాడుతున్నాయని ఫెడర్ సెక్యూరిటీ సర్వీస్ ఆరోపించింది. అందమైన యువతుల ప్రొఫైల్స్ (Bots) ద్వారా రష్యాలోని యువకులను ఆకర్షించి.. రష్యాలో ఉగ్రదాడులు, ఆస్తులు తగులబెట్టడం వంటి విద్రోహ చర్యలకు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రేరేపిస్తున్నాయని పేర్కొంది.


ఇవి కూడా చదవండి

వన్డే ప్రపంచ కప్‌ 2027: స్క్వాడ్ సైజ్‌ను పెంచండి.. ఐసీసీకి ఆసీస్ కోచ్ విజ్ఞప్తి

‘మనం జీవించినా.. మరణించినా దేశం కోసమే’.. రాజ్యసభలో ఎంపీ విజయ్ ఉద్వేగ ప్రసంగం

Updated Date - Jul 29 , 2026 | 05:13 PM