పెరిగిన జీవన వ్యయంపై ఇటలీలో నిరసనలు
ABN , Publish Date - Nov 21 , 2026 | 01:58 AM
ఇటలీలో పెరిగిపోయిన జీవన వ్యయంపై శుక్రవారం పలు నగరాల్లో కార్మికులు, విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించారు.
రోమ్: ఇటలీలో పెరిగిపోయిన జీవన వ్యయంపై శుక్రవారం పలు నగరాల్లో కార్మికులు, విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించారు. వేతనాలు పెంచాలని, జీవన వ్యయం తగ్గించాలని, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పెరిగిపోయిన జీవన వ్యయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇటలీలోని అతి పెద్ద ట్రేడ్ యూనియన్ సీజీఐఎల్ 24 గంటలపాటు నిరసనలకు పిలుపు ఇచ్చింది. దీంతో నిరసనకారులు 100కు పైగా నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. వేతనాలు నామమాత్రంగా ఉన్నాయని, జీవన వ్యయాలు పెరిగిపోతూనే ఉన్నాయని వారు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రైవేటు వాహనాలపై కుల గుర్తులు, పేర్ల నిషేధం.. గుజరాత్ ప్రభుత్వం ఆదేశం
ఆర్మీ జవాన్‌కు చలాన్ విధించిన అధికారి.. విధుల నుంచి తొలగింపు!