Share News

అఫ్గానిస్థాన్‌లోని 10 ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు..

ABN , Publish Date - Sep 24 , 2026 | 09:53 AM

పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. అఫ్గాన్ భూభాగంలోని 10 ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక, డ్రోన్ దాడులు చేసింది.

అఫ్గానిస్థాన్‌లోని 10 ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు..
Pakistan strikes Afghanistan

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. అఫ్గాన్ భూభాగంలోని 10 ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక, డ్రోన్ దాడులు చేసింది. అఫ్గానిస్థాన్ నుంచి తమ భూభాగంపై జరిగిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగానే తాజా దాడులు చేసినట్టు పాకిస్థాన్ పేర్కొంది. డ్రోన్లను నిల్వ చేయడం, ప్రయోగించడం కోసం ఆ ప్రాంతాలను ఉపయోగిస్తున్నారని పాకిస్థాన్ పేర్కొంది (Pakistan strikes Afghanistan).


పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ గురువారం ఈ దాడుల విషయాన్ని వెల్లడించారు. తమ దేశంపై జరిగిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా అఫ్గానిస్థాన్‌లోని 10 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. సైనిక లక్ష్యాలపైనే దాడులు చేశామని వెల్లడించారు. ఈ దాడులు తమ దేశ రక్షణ హక్కులో భాగంగా చేపట్టినవని, దాడులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించామని తరార్ పేర్కొన్నారు. అయితే దాడులకు గురైన ప్రాంతాల వివరాలను మాత్రం పాకిస్థాన్ బహిరంగంగా వెల్లడించలేదు (Pakistan Afghanistan conflict).


బుధవారం అఫ్గానిస్థాన్ వైపు నుంచి తమ గగనతలంలోకి వచ్చిన 8 డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని పాకిస్థాన్ భద్రతా వర్గాలు తెలిపాయి (Pakistan airstrikes). అయితే, అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం మాత్రం పాకిస్థాన్ ఆరోపణలను ఖండించింది. పాకిస్థాన్‌పై ఎలాంటి దాడులూ చేయలేదని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


అమెరికాలో ల్యాండ్ అయిన జిన్‌పింగ్.. స్వయంగా స్వాగతం పలికిన ట్రంప్..

Updated Date - Sep 24 , 2026 | 09:58 AM