Share News

పాక్‌లో పోలీసు పోస్టుపై కారు బాంబు దాడి

ABN , Publish Date - May 11 , 2026 | 06:11 AM

పాకిస్థాన్‌ ఖైబర్‌ పంఖ్తూఖ్వా ప్రావిన్సు బన్నూ ప్రాంతంలోని పోలీసు పోస్టుపై ఉగ్రవాదుల దాడిలో 21 మంది పోలీసులు మరణించారు...

పాక్‌లో పోలీసు పోస్టుపై కారు బాంబు దాడి

  • 21 మంది పోలీసుల మృతి

పెషావర్‌, మే 10: పాకిస్థాన్‌ ఖైబర్‌ పంఖ్తూఖ్వా ప్రావిన్సు బన్నూ ప్రాంతంలోని పోలీసు పోస్టుపై ఉగ్రవాదుల దాడిలో 21 మంది పోలీసులు మరణించారు. శనివారం రాత్రి ఓ సూసైడ్‌ బాంబర్‌ పేలుడు పదార్థాలు నింపిన కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడగా వెంటనే మరికొందరు ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు. కారు బాంబు పేలుడు ధాటికి పోలీసు పోస్టు భవనం ధ్వంసమైంది. ఉగ్రవాదులు దాడిలో డ్రోన్లు కూడా ఉపయోగించారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ దాడికి పాల్పడింది తామేనని కొన్ని తీవ్రవాద సంస్థలు కలిసి ఏర్పడిన ‘ఇత్తెహాద్‌-ఉల్‌-ముజాహిదీన్‌ పాకిస్థాన్‌’ (ఐఎంపీ) ప్రకటించింది. బన్నూ జిల్లా అఫ్గనిస్థాన్‌ సరిహద్దులో ఉంది. ఉగ్రదాడిని పాక్‌ ప్రధాని షరీఫ్‌ ఖండించారు.

ఈ వార్తలు కూడా చదవండి...

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం

సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 11 , 2026 | 06:11 AM