Share News

బయటపడిన పాక్ వక్రబుద్ధి.. మోదీ ఫొటోను క్రాప్ చేసి సోషల్ మీడియాలో పోస్టు..

ABN , Publish Date - Sep 01 , 2026 | 04:12 PM

పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. షాంఘై సహకార సంస్థ సదస్సు వేదికగా సభ్య దేశాల అధినేతలు దిగిన ఫొటోను పాక్ క్రాప్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వివాదం చెలరేగింది.

బయటపడిన పాక్ వక్రబుద్ధి.. మోదీ ఫొటోను క్రాప్ చేసి సోషల్ మీడియాలో పోస్టు..
SCO Summit

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సదస్సు వేదికగా పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా సభ్య దేశాల అధినేతలు దిగిన ఫొటోను పాక్ క్రాప్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వివాదం చెలరేగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కనిపించకుండా కట్ చేసిన ఫొటోను పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం పోస్టు చేయడం కలకలం రేపింది. అలాగే ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను హైలైట్ చేస్తూ ఫొటో మధ్యలో కనిపించేలా ఎడిట్ చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి.


కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో మంగళవారం జరిగిన ఎస్‌సీవో సదస్సులో 10 సభ్య దేశాల నేతలు కలిసి ఫొటో దిగారు. అయితే పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన చిత్రంలో మోదీతో పాటు ఇరాన్ అధ్యక్షుడు, మరికొందరు నేతలు కనిపించలేదు. ఫొటోను అలా కట్ చేయడం ద్వారా షెహబాజ్ షరీఫ్‌ను గ్రూప్‌లో మధ్యలో ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేసినట్లు స్పష్టమైంది. వాస్తవానికి పూర్తి ఫొటోలో షెహబాజ్ షరీఫ్ కుడివైపు నుంచి నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన అసలు ఫొటో స్పష్టం చేసింది. అందులో ఎస్‌సీవో నేతలందరితో పాటు షెహబాజ్ షరీఫ్ కూడా స్పష్టంగా కనిపించారు. దీంతో పాకిస్థాన్ చేసిన ఎడిటింగ్ సోషల్ మీడియాలో బయటపడింది.

Pak2.jpg


మరోవైపు, షెహబాజ్ షరీఫ్ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసిన ఎస్‌సీవో నేతల రౌండ్‌టేబుల్ వీడియోలోనూ మోదీ కనిపించకుండా క్రాప్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు పాకిస్థాన్ చర్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పూర్తి గ్రూప్ ఫొటోలను షేర్ చేస్తూ పాకిస్థాన్ తీరును ఎండగట్టారు. కొందరు నెటిజన్లు షెహబాజ్ షరీఫ్ చేతిలో బిక్షాటన పాత్ర ఉన్నట్లుగా ఫొటోలను ఎడిట్ చేసి మరీ పోస్టు చేశారు. గతంలో తాను ఆర్థిక సాయం కోసం ప్రపంచ దేశాల చుట్టూ తిరగాల్సి వస్తోందని పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఈ పోస్టులు చేశారు. అలాగే, పాకిస్థాన్ పీఎంవో ఫొటోను ఇలా కట్ చేయడాన్ని ‘చిన్నపిల్లల సోషల్ మీడియా ట్రిక్’ అంటూ పలువురు విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి

పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

Updated Date - Sep 01 , 2026 | 04:32 PM