చేతులు నరికేస్తామన్న పాక్ మంత్రి.. ఇప్పుడు భారత్‌లో పర్యటనకు సిద్ధం..
ABN , Publish Date - Nov 19 , 2026 | 09:34 AM
గతంలో సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన పాక్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్.. ఢిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశానికి హాజరుకానున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌కు చెందిన ఓ కేంద్ర మంత్రి భారత్‌లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. గతంలో సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన పాక్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్.. ఢిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశానికి హాజరుకానున్నారు. 2023 తర్వాత పాకిస్థాన్‌కు చెందిన ఓ కేంద్ర మంత్రి భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కానుంది (Pakistan Minister India Visit).
నవంబర్ 20 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో ఎస్‌సీఓ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పాకిస్థాన్ తరఫున పర్యావరణ సమన్వయ శాఖ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్ హాజరుకానున్నారు. తొలుత పాకిస్థాన్ జాతీయ వారసత్వం, సంస్కృతి శాఖ మంత్రి ఔరంగజేబ్ ఖాన్ ఖిచీకి భారత్ ఆహ్వానం పంపింది. అయితే పాకిస్థాన్ ఆయన స్థానంలో ముసాదిక్ మాలిక్‌ను నామినేట్ చేసింది. గతంలో 2023 మేలో గోవాలో జరిగిన ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల సమావేశానికి అప్పటి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరయ్యారు. ఆ తర్వాత పాకిస్థాన్‌కు చెందిన కేంద్ర మంత్రి భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కానుంది (SCO Meeting 2026).
ముసాదిక్ మాలిక్ గతంలో సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) విషయంలో భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. తమ దేశానికి కేటాయించిన నీటి వాటాను నియంత్రించాలనుకుంటున్న వారి చేతులు నరికేస్తామని హెచ్చరించారు. భారత్ తమ నీటి సరఫరాను నియంత్రించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపివేయడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో ఇరు దేశాల మధ్య జల వివాదాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చాయి.
ఇవి కూడా చదవండి..
2035 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఇస్లాం.. క్రైస్తవులను దాటేయనున్న ముస్లిం జనాభా..
గాజాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. హమాస్ ఆధీన ప్రాంతంలోకి ఇజ్రాయెల్ సైన్యం!