Share News

కాల్పుల విరమణపై నేడు, రేపు పాకిస్థాన్‌లో చర్చలు

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:40 AM

అమెరికా-ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పాకిస్థాన్‌ ఆధ్వర్యంలో...

కాల్పుల విరమణపై నేడు, రేపు పాకిస్థాన్‌లో చర్చలు

అమెరికా-ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పాకిస్థాన్‌ ఆధ్వర్యంలో సౌదీ అరేబియా, తుర్కియే, ఈజిప్ట్‌ ఇప్పటివరకు ఇరు వర్గాలతో ఫోన్‌ల ద్వారా చర్చలు జరపగా.. ఆది, సోమవారాల్లో ప్రత్యక్షంగా భేటీకానున్నాయి. పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ ఆహ్వానం మేరకు సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్‌ ఫైసల్‌ బిన్‌ ఫర్హాన్‌, తుర్కియే మంత్రి హకాన్‌ ఫిదాన్‌, ఈజిప్ట్‌ మంత్రి బద్ర్‌ అబ్దెలాట్టీ శనివారమే పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ శనివారం ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు ఫోన్‌ చేసి చర్చించారు.

ఇవి కూడా చదవండి...

సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు

అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 29 , 2026 | 06:40 AM