వాళ్లూ భారత్ లాంటి శత్రువులే.. చంపడం తప్పుకాదు: పాక్ రక్షణ మంత్రి
ABN , Publish Date - Jul 29 , 2026 | 10:13 AM
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనకారులపై భద్రతా బలగాల కాల్పులను పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సమర్థించడం తీవ్ర వివాదానికి దారితీసింది.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో నిరసనకారులపై భద్రతా బలగాల కాల్పులను పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సమర్థించడం తీవ్ర వివాదానికి దారితీసింది. నిరసనల్లో పాల్గొన్న వారిని 'భారత్‌లాంటి శత్రువులు'గా అభివర్ణించిన ఆసిఫ్.. వారిని చంపడం తప్పుకాదన్నారు (Khawaja Asif about PoK Protests).
పీవోకే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో భారీ నిరసనలు కొనసాగాయి. ఈ నిరసనలను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో కనీసం 14 మంది కార్యకర్తలు మృతి చెందినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఇతర నివేదికలు మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని సూచిస్తున్నాయి (PoK Violence).
స్థానిక టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ, 'నిరసనకారులను కూడా భారత్ మాదిరిగానే శత్రువులుగా చూస్తాను. దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది' అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి (Pakistan Defence Minister comments).
ఇదిలా ఉండగా, పీవోకేలో నిరసనలపై బలప్రయోగం, పౌరుల మరణాలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి (India Pakistan). భారత్ ఇప్పటికే పీవోకేలో జరుగుతున్న పరిణామాలపై పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించింది. అక్కడి ప్రజలపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు ఇస్లామాబాద్ బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్.. 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్..
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..