అఫ్గానిస్థాన్‌పై పాక్ వైమానిక దాడులు
ABN , Publish Date - Oct 01 , 2026 | 09:21 AM
అఫ్గానిస్థాన్‌పై పాక్ మరోసారి వైమానిక దాడులకు దిగింది. ఈ విషయాన్ని ఓ స్థానిక అధికారి గురువారం తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌పై పాక్ మరోసారి వైమానిక దాడులకు దిగింది. ఈ విషయాన్ని ఓ స్థానిక అధికారి గురువారం తెలిపారు. ‘హెల్మాండ్ ప్రావిన్స్‌లోని గార్మసిర్ జిల్లాలోగల రెండు ఇళ్లపై పాక్ సైనిక పాలకుల ఆధ్వర్యంలో దాడి జరిగింది’ అని సమాచార, సాంస్కృతిక శాఖ హెడ్ మావ్లావీ షేర్ మొహమ్మద్ వహాదత్ తెలిపారు. ఈ దాడిలో సుమారు నలుగురు మరణించారని, ఆరుగురు గాయపడ్డారని చెప్పారు. వీరిలో అత్యధిక శాతం మంది మహిళలు, చిన్నారులేనని అన్నారు.
గతవారం (సెప్టెంబర్ 24) కూడా అఫ్గానిస్థాన్‌లోని పలు ప్రావిన్సులపై పాక్ దాడులు చేసింది. ఏకంగా కాందహార్‌పై కూడా ఈ దాడులు జరిగాయి. ఉగ్ర స్థావరాలు ఉన్న మొత్తం 10 ప్రాంతాల్లో దాడులు చేశామని పాక్ తెలిపింది. తమపై ఉగ్రవాదం ఎగదోస్తోందని అఫ్గానిస్థాన్‌పై మండిపడింది. అయితే, తాలిబాన్లు మాత్రం పాక్ ఆరోపణలను తోసిపుచ్చారు. అఫ్గాన్ సరిహద్దుల్ని, సార్వభౌమత్వాన్ని పాక్ గౌరవించట్లేదని మండిపడింది. గతకొన్ని నెలలుగా పాక్, అఫ్గాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
భారత పైలట్ మచార్‌పై మోదీ, ట్రంప్, నెతన్యాహు ప్రశంసలు
ఇంధన నౌక హైజాక్.. భారతీయుడి హత్య