Share News

విభేదాలను పక్కన పెట్టండి.. ఇస్లామిక్ నాటో కోసం ముందుకు రండి: పాకిస్థాన్

ABN , Publish Date - Aug 10 , 2026 | 09:33 PM

ముస్లిం దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని పాకిస్థాన్ పిలుపునిచ్చింది. ముస్లిం దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి, నాటో తరహాలో సామూహిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కోరారు.

విభేదాలను పక్కన పెట్టండి.. ఇస్లామిక్ నాటో కోసం ముందుకు రండి: పాకిస్థాన్
Khawaja Asif

ఇంటర్నెట్ డెస్క్: ముస్లిం దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని పాకిస్థాన్ పిలుపునిచ్చింది. ముస్లిం దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి, నాటో తరహాలో సామూహిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కోరారు. పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ ఇటీవల కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు (Islamic NATO).


ముస్లిం దేశాలు ద్వైపాక్షిక, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి సామూహిక భద్రత కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ప్రతీ దేశం తన సొంత భద్రతను మాత్రమే చూసుకోవడం కాకుండా, ఇతర సభ్య దేశాల భద్రతకు కూడా అండగా నిలిచే వ్యవస్థ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలోనే నాటో తరహా రక్షణ కూటమి ఆలోచనను ఆయన ప్రస్తావించారు. ఇది కేవలం మూడు దేశాలకు పరిమితమైన కూటమిగా కాకుండా, ఇతర ముస్లిం దేశాలకు కూడా అందుబాటులో ఉండాలని ఆయన కోరారు (Muslim countries alliance).


ఆగస్టు 7న పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు మక్కాలో సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి (Pakistan defence alliance). ఈ ఒప్పందం ప్రకారం.. మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, దాన్ని మిగిలిన దేశాలపై జరిగిన దాడిగా పరిగణించి పరస్పరం సహాయం చేసుకుంటాయి. ప్రస్తుతం ఈ రక్షణ వ్యవస్థలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మాత్రమే వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఇతర దేశాలను కూడా చేర్చుకునే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

తమిళ్ తాయ్ వాళ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..


సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ..

Updated Date - Aug 10 , 2026 | 09:33 PM