Share News

కొలంబియాలో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో ప్రకంపనలు..

ABN , Publish Date - Aug 10 , 2026 | 08:35 PM

కొలంబియాను భారీ భూకంపం వణికించింది. సోమవారం ఉదయం పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో భవనాలు దెబ్బతినగా, కొన్ని కూలిపోయాయి.

కొలంబియాలో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో ప్రకంపనలు..
Colombia earthquake

ఇంటర్నెట్ డెస్క్: కొలంబియాను భారీ భూకంపం వణికించింది. సోమవారం ఉదయం పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో భవనాలు దెబ్బతినగా, కొన్ని కూలిపోయాయి. తాజా సమాచారం ప్రకారం కనీసం ఇద్దరు మరణించారు. పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపం ధాటికి పొరుగు దేశమైన ఈక్వెడార్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి (Colombia earthquake).


కొలంబియాలోని చోకో ప్రాంతంలోని శాన్ జోస్ డెల్ పాల్మార్ సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం సుమారు 100 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు నివేదికలు తెలిపాయి. ఈ భూకంపం ధాటికి చోకో ప్రావిన్స్ రాజధాని క్విబ్డోలో భవనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలువురు గాయపడినట్లు స్థానిక గవర్నర్ తెలిపారు. కొన్ని భవనాలు కూలిపోయాయని వెల్లడించారు (7.4 magnitude earthquake).


భూకంప ప్రభావం కాలీ, పెరీరా నగరాల్లో కూడా తీవ్రంగా కనిపించింది (Earthquake damage). కాలీలో కనీసం 20 భవనాలు కూలిపోయినట్లు నగర మేయర్ వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు సమాచారం. కాగా, నష్టం ఎంతమేర జరిగిందో అంచనా వేసేందుకు కొలంబియా విపత్తు నిర్వహణ అధికారులు స్థానిక యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్నారు. సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని శిథిలాలను తొలగించే పనులు చేపట్టాయి.


ఇవి కూడా చదవండి..

తమిళ్ తాయ్ వాళ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..


సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ..

Updated Date - Aug 10 , 2026 | 08:35 PM