బలూచిస్థాన్ హోం మంత్రిపై దాడి, భద్రతా సిబ్బందికి గాయాలు
ABN , Publish Date - Aug 14 , 2026 | 05:47 PM
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున బలూచిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బలూచిస్థాన్ హోం మంత్రి మీర్ జియావుల్లా లాంగౌ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై దాడి జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున బలూచిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బలూచిస్థాన్ హోం మంత్రి మీర్ జియావుల్లా లాంగౌ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడగా, మంత్రి సురక్షితంగా బయటపడ్డారు.
కలాత్ జిల్లా నుంచి క్వెట్టాకు వెళ్తున్న కాన్వాయ్‌పై మస్తుంగ్ జిల్లాలోని ఖడ్కోచా గోరు సమీపంలో సాయుధ దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో దుండగులకు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గాయపడిన భద్రతా సిబ్బందిని చికిత్స కోసం షహీద్ నవాబ్ ఘౌస్ బక్ష్ రైసానీ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న సమయంలో ఈ దాడి చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. బలూచిస్థాన్‌లో కొంతకాలంగా భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. దాడి వెనుక ఎవరు ఉన్నారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీనిపై భద్రతా సంస్థలు ఆధారాలను సేకరిస్తున్నాయి. ఘటనపై దర్యాప్తు చేపట్టాయి. అధికారిక దర్యాప్తు పూర్తయిన తర్వాతే దాడికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read:
సమయ్ రైనా బృందం కేసు క్లోజ్.. సుప్రీంకోర్టు ప్రశంసలు
ఈశాన్య రాష్ట్రాల వారి కేవైసీ కష్టాలు.. నెట్టింట వీడియో వైరల్