మార్చి నెలాఖరు వరకు పాకిస్తాన్ గగనతలం పాక్షిక మూసివేత
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:36 PM
మధ్యప్రాచ్యంలో ఘర్షణల తీవ్రత దృష్ట్యా వాణిజ్య విమానాలకు పాక్షికంగా తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్టు పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (PAA) ప్రకటించింది. మార్చి 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆంక్షలు మార్చి 31వ తేదీ వరకూ కొనసాగుతాయని తెలిపింది
ఇస్లామాబాద్: మధ్యప్రాచ్యంలో ఘర్షణల తీవ్రత దృష్ట్యా వాణిజ్య విమానాలకు అనుమతి లేకుండా తమ గగనతలాన్ని పాక్షికంగా మూసివేస్తున్నట్టు పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (PAA) ప్రకటించింది. మార్చి 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆంక్షలు మార్చి 31వ తేదీ వరకూ కొనసాగుతాయని తెలిపింది.
అమెరికా-ఇజ్రాయెల్ గత శనివారంనాడు ఇరాక్‌పై దాడులు మొదలుపెట్టడం, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై టెహ్రాన్ ప్రతిదాడులు దిగడంతో వివిధ దేశాలు తమ గగనతలాన్ని మూసివేస్తున్నాయి. ప్రధాన ఎయిర్‌లైన్స్‌లు కీలక మార్గాల్లో ప్రయాణాలను రద్దు చేయడం లేదా దారి మళ్లించడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. పాకిస్థాన్ నుంచి దుబాయ్, దోహా, అబూదబి, మస్కట్ ఇతర ప్రాంతాలకు సుమారు 184 అంతర్జాతీయ విమానాలు సోమవారంనాడు రద్దయ్యాయి. దీంతో కరాచీ-లాహోర్ విమాన మార్గాల్లో కమర్షియల్ విమానాలను పాక్షికంగా మూసివేస్తున్నట్టు పీఏఏ ప్రకటించింది. అయితే కచ్చితమైన కారణాన్ని వెల్లడించలేదు.
ఒక్క సోమవారంనాడే పాకిస్థాన్‌కు 100కు పైగా విమానాలు రద్దయినట్టు ఒక అధికారి తెలిపారు. ఇరాన్‌పై యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకూ పాకిస్థాన్ నుంచి మధ్యప్రాచ్చ దేశాలకు వెళ్లాల్సిన 300కు పైగా విమానాలు రద్దయినట్టు చెప్పారు. అయితే దేశీయ విమానాలకు పెద్దగా అంతరాయం కలగలేదన్నారు. విమానాల రాకపోకల అప్‌డేట్స్‌పై ప్రయాణికులు సంబంధిత ఎయిర్‌లైన్స్‌తో ఎప్పటికప్పుడు సంప్రదించి సమాచారం తెలుసుకోవాలని పాకిస్థాన్ పౌర విమానయాన శాఖ ప్రతినిధి ఒకరు సూచించారు.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్ జలసంధి మూసివేత.. భారత్‌పై తీవ్ర ప్రభావం తప్పదా..?
ఇరాన్‌లో భూకంపం.. 4.3 తీవ్రత నమోదు..