బంగాళాఖాతంలో పడవల మునక!
ABN , Publish Date - Jul 17 , 2026 | 05:49 AM
మయన్మార్‌లో కొనసాగుతున్న హింసాత్మక పరిస్థితుల నుంచి ప్రాణాలు దక్కించుకునేందుకు సముద్ర మార్గంలో బయలుదేరిన 500మందికి పైగా రోహింగ్యాలు జలసమాధి...
500 మంది రోహింగ్యాల జలసమాధి ?
సిడ్నీ, జూలై 16: మయన్మార్‌లో కొనసాగుతున్న హింసాత్మక పరిస్థితుల నుంచి ప్రాణాలు దక్కించుకునేందుకు సముద్ర మార్గంలో బయలుదేరిన 500మందికి పైగా రోహింగ్యాలు జలసమాధి అయినట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. జూన్ చివరలో మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నుంచి బయలుదేరిన 2 పడవలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య బంగాళాఖాతంలో మునిగిపోయి ఉంటాయని ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ, అంతర్జాతీయ వలసల సంస్థ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. వీటిలో 250మందితో ప్రయాణిస్తున్న మొదటి పడవతో కొద్దిసేపటికే సంబంధాలు తెగిపోగా, 280మందితో ఉన్న రెండో పడవ జూలై 8న మయన్మార్ తీరంలో మునిగిపోయినట్లు భావిస్తున్నారు. సముద్రయానాలకు అనుకూలించని సమయంలో వీరు ప్రయాణించడంవల్ల ప్రాణాలతో బయటపడే అవకాశం చాలా తక్కువని ఐరాస సంస్థలు పేర్కొన్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌పై హెచ్చరిక