Share News

ఇదే మీకు చివరి పని దినం..!

ABN , Publish Date - Sep 16 , 2026 | 06:08 AM

ఒరాకిల్‌ సోమవారం కొందరు ఉద్యోగులకు దిగ్ర్భాంతికర మెయిల్‌ పంపింది. ఉదయం 6 గంటల సమయంలో...

ఇదే మీకు చివరి పని దినం..!

  • ఉద్యోగులకు మెయిల్స్‌ పంపిన ఒరాకిల్‌

  • 2026లో ఇప్పటికే 21వేల కొలువుల కోత

వాషింగ్టన్‌, సెప్టెంబరు 15: ఒరాకిల్‌ సోమవారం కొందరు ఉద్యోగులకు దిగ్ర్భాంతికర మెయిల్‌ పంపింది. ఉదయం 6 గంటల సమయంలో ‘‘మీ ఉద్యోగానికి సంబంధించి కొంత కష్టమైన వార్తను మీతో పంచుకుంటున్నాం. ఈ రోజే మీకు చివరి పనిదినం’’ అని మెయిల్‌ పంపింది. మరో విడత లేఆ్‌ఫ్సలో భాగంగా ఈ మెయిల్స్‌ చేసింది. కంపెనీ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగానే ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు మెయిల్‌లో ఒరాకిల్‌ సంస్థ వెల్లడించింది. అయితే ఎంతమందిని తొలగించారన్న దానిపై ఒరాకిల్‌ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. ఒరాకిల్‌ ఏఐ వ్యాపారానికి భారీగా డిమాండ్‌ కనిపిస్తోంది. ఈ త్రైమాసికంలో అదనంగా 30 బిలియన్‌ డాలర్ల ఏఐ క్లౌడ్‌ కాంట్రాక్టులపై సంతకాలు చేసినట్లు సంస్థ వెల్లడించింది. అయినా డేటా సెంటర్లపై వ్యయం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగాలకు కోతలు పెడుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 21 వేలకు పైగా (13శాతం) ఉద్యోగులను తొలగించింది. 2026 ప్రారంభంలో ఒరాకిల్‌ సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.62 లక్షలు ఉండగా.. మే నాటికి అది 1.41 లక్షలకు తగ్గింది.

ఇవి కూడా చదవండి...

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల

చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 06:08 AM