ట్రంప్-జిన్‌పింగ్ భేటీ వేదిక సమీపంలోనే.. నిషేధిత ఎన్విడియా చిప్‌ల విక్రయాలు
ABN , Publish Date - Nov 28 , 2026 | 04:50 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇటీవల భేటీ అయిన వేదికకు కూతవేటు దూరంలోనే... అమెరికా నిషేధిత ఎన్విడియా అత్యాధునిక ఏఐ చిప్స్‌ను బహిరంగంగా విక్రయిస్తుండడం సంచలనం రేపుతోంది
చైనాలోని షెన్‌జెన్‌లో ఘటన
ఒక్కో సర్వర్ ధర 34 లక్షల డాలర్లు
అమెరికాలో దాని వెల 5 లక్షల డాలర్లే
వాషింగ్టన్, నవంబరు 27: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇటీవల భేటీ అయిన వేదికకు కూతవేటు దూరంలోనే... అమెరికా నిషేధిత ఎన్విడియా అత్యాధునిక ఏఐ చిప్స్‌ను బహిరంగంగా విక్రయిస్తుండడం సంచలనం రేపుతోంది. చైనాలోని షెన్‌జెన్ నగరంలో ఉన్న హువాచియాంగ్‌బే ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో బ్లాక్‌వెల్ సిరీస్‌కు చెందిన బీ300 చిప్స్‌తో కూడిన సర్వర్లను విక్రయిస్తున్నట్లు వాషింగ్టన్ పోస్టు ప్రత్యేక కథనం వెల్లడించింది. ఆ మార్కెట్‌కు వెళ్లిన ఓ అమెరికా విలేకరికి కూడా ఈ చిప్స్ అమ్ముతామని వ్యాపారులు ఆఫర్ చేయడం విశేషం. అమెరికాలో ఎగుమతి ఆంక్షలు ఉన్నప్పటికీ ఈ చిప్స్ చైనా మార్కెట్‌కు ఎలా చేరుతున్నాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఒక్కో సర్వర్‌లో ఎనిమిది బీ300 చిప్స్ ఉండగా, దాని ధరను 30-34 లక్షల డాలర్లుగా విక్రయదారులు చెబుతున్నట్లు పత్రిక పేర్కొంది. అమెరికాలో ఇదే తరహా సర్వర్ ధర కేవలం 5 నుంచి 6 లక్షల డాలర్లేనని బ్రూకింగ్ ఇన్‌స్టిట్యూషన్ నిపుణుడు కైల్ చాన్ వెల్లడించారు. అయితే విక్రయానికి ఉంచిన చిప్స్ నిజమైనవో కాదో నిర్ధారించలేకపోయినట్లు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది.