Share News

పన్నూన్‌ హత్యకు కుట్ర కేసులో నిఖిల్‌ గుప్తాకు 19 ఏళ్ల జైలు శిక్ష

ABN , Publish Date - Nov 21 , 2026 | 02:04 AM

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ హత్యకు కుట్ర పన్నిన కేసులో భారతీయుడు నిఖిల్‌ గుప్తాకు అమెరికా కోర్టు 19 ఏళ్ల 7 నెలల జైలు శిక్ష విధించింది.

పన్నూన్‌ హత్యకు కుట్ర కేసులో   నిఖిల్‌ గుప్తాకు 19 ఏళ్ల జైలు శిక్ష
image

న్యూయార్క్‌, నవంబరు 20: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ హత్యకు కుట్ర పన్నిన కేసులో భారతీయుడు నిఖిల్‌ గుప్తాకు అమెరికా కోర్టు 19 ఏళ్ల 7 నెలల జైలు శిక్ష విధించింది. న్యూయార్క్‌లోని ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి విక్టర్‌ మర్రెరో శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. 2023లో అమెరికాలో పన్నూన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు గుప్తాపై ఆరోపణలు ఉన్నాయి. హత్యకు సుపారీ ఇవ్వడం, అందుకు కుట్ర పన్నడం, మనీలాండరింగ్‌కు కుట్ర చేయడం వంటి మూడు అభియోగాలను ఈ ఏడాది ప్రారంభంలో ఆయన అంగీకరించారు. పన్నూన్‌ హత్యకు కిరాయి హంతకుడిని ఏర్పాటు చేసేందుకు గుప్తా ప్రయత్నించగా.. ఆయన సంప్రదించిన వ్యక్తి అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీఈఏ) రహస్య సమాచారదారుడిగా తేలింది. హత్యకు దాదాపు రూ.92 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది

ఇవి కూడా చదవండి..

ప్రైవేటు వాహనాలపై కుల గుర్తులు, పేర్ల నిషేధం.. గుజరాత్ ప్రభుత్వం ఆదేశం

ఆర్మీ జవాన్‌కు చలాన్ విధించిన అధికారి.. విధుల నుంచి తొలగింపు!

Updated Date - Nov 21 , 2026 | 03:08 AM