నిజ్జర్ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ ముఠా!
ABN , Publish Date - Jul 09 , 2026 | 05:41 AM
భారత్- కెనడా దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తతలకు కారణమైన ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో...
బిష్ణోయ్, గ్యాంగ్‌స్టర్ గోల్డీపై అమెరికాలో అభియోగాలు
వాషింగ్టన్, జూలై 8: భారత్- కెనడా దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తతలకు కారణమైన ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని అనుచరుడు గోల్డీ బ్రార్‌పై అమెరికా కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం భారత జైలులో ఉన్న బిష్ణోయ్.. 2023లో జరిగిన నిజ్జర్ హత్యకు జైలు నుంచే వ్యూహం రచించినట్లు లాస్‌ఎంజిల్స్‌లోని ఫెడరల్ కోర్టులో అమెరికా దర్యాప్తు సంస్థలు చార్జ్‌షీట్ దాఖలు చేశాయి. గోల్డీ బ్రార్ సమాచారం అందించిన వారికి ఎఫ్‌బీఐ 50వేల డాలర్ల రివార్డును ప్రకటించింది. కాగా, నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని నిర్ధారించే ఎలాంటి ఆధారాలు లభించలేదని కెనడా పోలీసులు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు
ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్ రైల్ ప్లాన్