Share News

ట్రంప్‌కు నెతన్యాహు అభినందనలు!

ABN , Publish Date - Apr 06 , 2026 | 08:00 AM

ప్రమాదంలో చిక్కుకున్న అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమాన ఫైటర్ ను సురక్షితంగా కాపాడిన తీరును ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు తెలిపారు.

ట్రంప్‌కు నెతన్యాహు అభినందనలు!
Netanyahu Trump F15 rescue

ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 6: పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ, అమెరికా చేపట్టిన సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్‌పై అంతర్జాతీయంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదంలో చిక్కుకున్న అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమాన సిబ్బందిని సురక్షితంగా కాపాడిన తీరును ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కొనియాడారు.

ఇరాన్ సరిహద్దుల సమీపంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో, సాంకేతిక కారణాల వల్ల లేదా శత్రు దాడుల వల్ల అమెరికాకు చెందిన ఒక ఎఫ్-15 యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. అయితే, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా సైన్యం మెరుపు వేగంతో స్పందించి, ఇరాన్ గగనతలాన శోధించి ఆ విమానంలోని సిబ్బందిని ప్రాణాలతో కాపాడిన సంగతి తెలిసిందే.


ఈ విజయంపై నెతన్యాహు స్పందిస్తూ.. ఇది అమెరికా సైనిక సామర్థ్యానికి, అధ్యక్షుడు ట్రంప్ దృఢ నిశ్చయానికి నిదర్శనమని పేర్కొన్నారు. 'అమెరికన్ మిషన్ అత్యంత కచ్చితత్వంతో జరిగింది. పైలట్లను సురక్షితంగా తీసుకురావడంలో చూపిన ప్రతిభ అసాధారణం' అని ఆయన ప్రశంసించారు. ఈ క్లిష్ట సమయంలో అమెరికాకు ఇజ్రాయెల్ అండగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.


ఇవి కూడా చదవండి..

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 06 , 2026 | 09:13 AM