పొంగిపొర్లుతున్న సరస్సు.. సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి నేపాల్ పోలీసుల అలర్ట్..
ABN , Publish Date - Aug 28 , 2026 | 01:30 PM
నేపాల్‌లో మరోసారి వరదలు వచ్చే అవకాశం ఉందని నేపాల్ పోలీస్ హెడ్ క్వాటర్స్ తెలిపింది. సహాయక చర్యల్లో పాల్గొన్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: నేపాల్‌లో మరోసారి వరదలు వచ్చే అవకాశం ఉందని నేపాల్ పోలీస్ హెడ్ క్వాటర్స్ తెలిపింది. సహాయక చర్యల్లో పాల్గొన్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఈ మేరకు నేపాల్ పోలీస్ హెడ్ క్వాటర్స్ శుక్రవారం ఉదయం ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘టిబెటన్ వైపు ఓ వాటర్ డ్యామ్ బద్ధలైందని సమాచారం అందింది. సహాయక చర్యల్లో పాల్గొన్న భద్రతా సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది, సాధారణ ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి’ అని పేర్కొంది.
పొంగిపొర్లుతున్న కృత్రిమ సరస్సు..
బుధవారం వచ్చిన వరదల కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగి చోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో నదుల సంగమ ప్రాంతంలో అడ్డంగా పడ్డాయి. నదుల ప్రవాహం ఆగిపోవడంతో అక్కడ ఒక కృత్రిమ సరస్సు ఏర్పడింది. అందులో దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల సరస్సులో నీటి మట్టం మరింత పెరిగింది. సరస్సు పెద్ద ఎత్తున పొంగిపొర్లుతోంది. సరస్సుకు అడ్డుపడ్డ కొండచరియలు నీటి ఉద్ధృతికి ఏ క్షణమనా బద్ధలు అయ్యే అవకాశం ఉంది. మళ్లీ భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
అమెరికాలో హైదరాబాదీ యువతి హత్య.. ఆగ్రాలో నిందితుడి అరెస్ట్..