నేపాల్ టూరిజం బోర్డు కీలక ప్రకటన.. గల్లంతైన వారిలో 178 మంది భారతీయులు..
ABN , Publish Date - Aug 27 , 2026 | 03:17 PM
నేపాల్ భోటేకోశీ నది మెరుపు వరదలపై ఆ దేశ టూరిజం బోర్డు గురువారం కీలక ప్రకటన విడుదల చేసింది. రసువా, నువాకోట్, ధాదింగ్, గోర్ఖా ప్రాంతాల్లో భోటేకోశీ, త్రిశూలి నదుల వరదల ప్రభావం పడిందని ఆ ప్రకటనలో పేర్కొంది.
ఇంటర్‌నెట్ డెస్క్: నేపాల్ భోటేకోశీ నది మెరుపు వరదలపై ఆ దేశ టూరిజం బోర్డు గురువారం కీలక ప్రకటన విడుదల చేసింది. రసువా, నువాకోట్, ధాదింగ్, గోర్ఖా ప్రాంతాల్లో భోటేకోశీ, త్రిశూలి నదుల వరదల ప్రభావం పడిందని ఆ ప్రకటనలో పేర్కొంది. మొత్తం 644 మంది పర్యాటకులు/ప్రయాణికులు గల్లంతైనట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపింది. గల్లంతైన వారిలో 127 మంది నేపాల్ పౌరులు, 517 మంది విదేశీయులు ఉన్నారని వెల్లడించింది. గల్లంతైన విదేశీయుల్లో 178 మంది భారతీయులు, ఆస్ట్రేలియాకు చెందిన వారు 35 మంది, ఉక్రెయిన్ 53, అమెరికా 65, మలేషియా 51, కెనడా 25, యూకేకు చెందిన వారు 33 మంది ఉన్నారని పేర్కొంది.
ట్రెక్కింగ్/ట్రావెల్ కంపెనీల నుంచి వచ్చిన వారి వివరాలను స్థానిక అధికారులు, భద్రతా సంస్థలు, గైడ్లతో కలిసి ధ్రువీకరిస్తున్నామని తెలిపింది. ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న, గాయపడిన వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. భోటేకోశీ, త్రిశూలి నదుల వెంట ఉన్న నాలుగు జిల్లాల్లో నదీ తీర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు నేపాల్ టూరిజం బోర్డు తెలిపింది. అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ 1234, హెల్ప్‌లైన్ 1144, టూరిస్ట్ పోలీస్ 9851289445 నంబర్లను ప్రకటించింది.
నేపాల్ వరదలపై భారత విదేశాంగశాఖ ప్రకటన
నేపాల్ వరదలపై భారత విదేశాంగ శాఖ గురువారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో.. ‘వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతయ్యారు. 73 మంది త్రిశూలి ప్రాజెక్టు సిబ్బంది గల్లంతయ్యారు. 86 మంది తమిళనాడు యాత్రికులు, 33 మంది కేరళవాసులు, 32 మంది బెంగాల్ వాసులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఈషా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది ఉన్నారు. ఇప్పటివరకు 21 మంది భారతీయులను రెస్క్యూ చేశాం. మానస సరోవర్‌లో మరో 200 మంది భారతీయులు చిక్కుకున్నారు. నేపాల్‌కు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తున్నాం. నేపాల్‌కు 47.5 టన్నుల సహాయ సామగ్రి పంపించాం. నేపాల్‌కు తాత్కాలిక వంతెనలు పంపిస్తాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు భారతీయుల స్థితిగతులు, క్షేమ సమాచారం తెలుసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు, టూర్ ఆపరేటర్లతో సమన్వయం చేస్తున్నాం’ అని తెలిపింది.
ఇవి కూడా చదవండి
హరీశ్ రావు అరెస్ట్.. కాలినడకన పీఎస్‌కు మాజీ మంత్రి
దేశంలో క్రీడలకు కొత్త దిశ చూపిన ఘనత ప్రధాని మోదీది: కేంద్ర మంత్రి పెమ్మసాని