Share News

ఐఎస్‌ఎస్‌ వెలుపల 7.20గంటలు స్పేస్‌వాక్‌

ABN , Publish Date - Jul 02 , 2026 | 06:05 AM

నాసా వ్యోమగాములు క్రిస్‌ విలియమ్స్‌, జెస్సికా మిర్‌లు మంగళవారం భూమికి 400కిలోమీటర్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఐఎ్‌సఎస్‌) వెలుపల 7.20గంటల పాటు

ఐఎస్‌ఎస్‌ వెలుపల 7.20గంటలు స్పేస్‌వాక్‌

  • కెనడార్మ్‌2 రోబోటిక్‌ చేతి మణికట్టును

మార్చడంలో వ్యోమగాములు క్రిస్‌, జెస్సికా సక్సెస్‌

వాషింగ్టన్‌, జూలై 1: నాసా వ్యోమగాములు క్రిస్‌ విలియమ్స్‌, జెస్సికా మిర్‌లు మంగళవారం భూమికి 400కిలోమీటర్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఐఎ్‌సఎస్‌) వెలుపల 7.20గంటల పాటు స్పేస్‌ వాక్‌ చేశారు. ఎంతో కష్టపడి ఐఎ్‌సఎ్‌సలో అత్యంత కీలకమైన ‘కెనడార్మ్‌2’ అనే 17.6 మీటర్ల పొడవైన రోబోటిక్‌ చేతి మణికట్టు(జాయింట్‌)ను మార్చారు. ‘కెనడార్మ్‌2’ రోబోటిక్‌ చేయి ఐఎ్‌సఎ్‌సలో 25ఏళ్లుగా సేవలందిస్తోంది. ఐఎ్‌సఎ్‌సకు వచ్చే రవాణా నౌకలను పట్టుకోవడానికి, భారీ పరికరాలను ఒకచోటు నుంచి మరో చోటుకు మార్చడానికి ఇది చాలా కీలకమైనది. అయితే, మే 27న ఈ చేయిలోని ఓ జాయింట్‌ వద్ద సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ జాయింట్‌ను మార్చాలని నిర్ణయానికి వచ్చిన నాసాఇటీవల స్పేస్‌వాక్‌ 95 మిషన్‌ను చేపట్టింది. క్రిస్‌, జెస్సికాలతో పాటు మరో ఇద్దరిని ఐఎ్‌సఎ్‌సకు పంపించింది. మంగళవారం క్రిస్‌, జెస్సికా ఐఎ్‌సఎస్‌ యొక్క క్వెస్ట్‌ ఎయిర్‌లాక్‌ నుంచి బయటకు వచ్చి స్పేస్‌వాక్‌ చేస్తూ 90కిలోల బరువు ఉన్న కొత్త జాయింట్‌ను రోబోటిక్‌ చేతికి అమర్చారు. పాతదాన్ని తొలగించి ఐఎ్‌సఎ్‌సలో భద్రపర్చారు. క్రిస్‌కు ఇది రెండో స్పేస్‌వాక్‌ కాగా, జెస్సికాకు ఐదోది. కాగా, కొత్తగా అమర్చిన జాయింట్‌ బాగా పనిచేస్తోందని నాసా వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో కుళ్లిన చేపల అక్రమ నిల్వ గుట్టురట్టు.. నలుగురి అరెస్ట్

మెదక్ జిల్లాలో విషాద ఘటన.. పాము కాటుకు భార్య మృతి.. మృత్యువుతో పోరాడుతున్న భర్త

Updated Date - Jul 02 , 2026 | 06:05 AM