తెలుగు తేజం!
ABN , Publish Date - Oct 02 , 2026 | 06:04 AM
తరగతి గదిలో టీచర్ ఇంగ్లీష్‌లో అడిగిన ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పలేక ఓ విద్యార్థి నవ్వులపాలయ్యాడు. అయితే ఆ ఘటనతో ఆయన కుంగిపోలేదు. తన బలహీనతనే బలంగా మార్చుకున్నాడు.
ఆ దేశ ప్రాచీన భాషలకు జీవం
ఇప్పటికే 14 భాషల్లో రచనలు
వాటి డాక్యుమెంటేషన్, వెబ్‌సైట్‌లు, మొబైల్ అప్లికేషన్లు తయారు
మరో 70 భాషలను అభివృద్ధి చేస్తా
నంద్యాల జిల్లా వాసి డాక్టర్ కె.శేఖర్
(ఆత్మకూరు-ఆంధ్రజ్యోతి) : తరగతి గదిలో టీచర్ ఇంగ్లీష్‌లో అడిగిన ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పలేక ఓ విద్యార్థి నవ్వులపాలయ్యాడు. అయితే ఆ ఘటనతో ఆయన కుంగిపోలేదు. తన బలహీనతనే బలంగా మార్చుకున్నాడు. మహనీయుల సూక్తులను ఆదర్శంగా తీసుకొని ముందడుగు వేశాడు. ఇంగ్లిష్ అంటే భయపడే స్థాయి నుంచి ఆ భాషను బోధించే స్థాయికి ఎదిగాడు. భాషల పట్ల తనకున్న మక్కువతో ఇథియోఫియాలోని ప్రాచీన భాషలకు జీవంపోశారు. కనుమరుగవుతున్న భాషలను కాపాడేందుకు ఆయన తీసుకున్న చొరవ ఆ దేశంలో భాషా ఉద్యమానికి తెరలేపింది. ఆయనే నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం తూడిచెర్ల గ్రామానికి చెందిన డాక్టర్ కె. శేఖర్. ఇథియోపియాలో స్థానిక భాషల అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న పోరాటంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
సామాన్య కుటుంబంలో జన్మించి..
తూడిచెర్లకు చెందిన దివంగత కుమ్మరి నారాయణ, లక్ష్మీదేవి దంపతుల కుమారుడైన శేఖర్ పదో తరగతి వరకు కనకయ్యకొట్టాల గ్రామంలో చదివారు. టెన్త్‌లో 40శాతం, ఇంటర్‌లో 38 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. మొదటినుంచీ ఇంగ్లిష్ అంటే భయపడేవారు. ఇంటర్ తర్వాత చెన్నైలో మెరైన్ రేడియో ఆఫీసర్ కోర్సుకు వెళ్లినప్పటికీ ఇంగ్లీష్‌పై పట్టులేక మధ్యలోనే తిరిగి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత హోసూరు (తమిళనాడు)లోని ఆదియామన్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఎంబీఏలో చేరారు. కళాశాలలో తొలిరోజే లెక్చరర్‌ఇంగ్లీష్‌లో అడిగిన ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక నవ్వుల పాలయ్యారు. దీంతో తనను ఇంగ్లిష్ ఓడించకూడదని బలంగా నిర్ణయించుకున్నారు. చెన్నై, కర్నూలు, హైదరాబాద్, బెంగళూరు, హోసూరు తదితర ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం సంపాదించారు.
ఇథియోపియాలో ప్రొఫెసర్‌గా...
ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత శేఖర్ 2005 నుంచి 2009 వరకు బెంగళూరులోని పెరుమాళ్ మణిమేఖలై కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అక్కడ ఉండగానే ఇథియోఫియాలో ప్రొఫెసర్‌గా అవకాశం వచ్చింది. ఆయన భార్య ఉమామహేశ్వరి సంపూర్ణ సహకారం అందించి ప్రోత్సహించడంతో ఆ దేశానికి పయనమయ్యారు.
ప్రాంతీయ భాషలపై పట్టు
ఇథియోపియా వెళ్లిన శేఖర్ 6నెలల వ్యవధిలోనే ఆ దేశ జాతీయ భాష అమ్హారిక్‌పై పట్టు సాధించారు. సుమారు 84 భాషలను ఆ దేశం జాతీయ భాషలుగా ఎంపిక చేసినప్పటికీ వాటన్నింటికీ కలిపి ఒకేఒక్క లిపి మాత్రమే ఉండేది. ఈ పరిస్థితుల్లో అవి కనుమరుగయ్యే ప్రమాదంలో పడటంతో వాటి డాక్యుమెంటేషన్, వెబ్‌సైట్, డిజిటలైజేషన్, పుస్తక రచనలు చేసేందుకు పూనుకున్నారు. తొలుత ‘స్పీక్ అమ్హారిక్ లాంగ్వేజ్- దట్ గోస్ టు ద హార్ట్స్ ఇథియోఫియన్స్’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని ప్రచురించేందుకు ఎవరూ ముందుకురాలేదు. చివరకు ఓ పబ్లిషర్ అమ్హారిక్ భాషాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకానికి మంచి ఆదరణ లభించడంతో ఆ తర్వాత హాడియా భాషలో మరో పుస్తకాన్ని రచించారు. ఈ విధంగా ఇప్పటి వరకు 14 భాషలకు సంబంధించి పుస్తకాలను, డాక్యుమెంటేషన్, వెబ్‌సైట్‌లు, మొబైల్ అప్లికేషన్లు వంటివి తయారు చేశారు. మరో 70 ప్రాంతీయ భాషలను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వ గుర్తింపుతో అవకాశాలు
ఇథియోపియా భాషాభివృద్ధి కోసం డాక్టర్ కే.శేఖర్ రచించిన పుస్తకాలను తొలుత వ్యతిరేకించిన ఆ దేశ ప్రభుత్వం... తమ భాష పట్ల చూపిన అభిమానాన్ని గుర్తించి ఆయనకు చక్కటి అవకాశాలను కల్పించింది. ఇథియోఫియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు శేఖర్ సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రాంతీయ భాషల అభివృద్ధిలో భాగంగా ఆయా భాషల డిజిటలైజేషన్ ప్రక్రియ, వెబ్‌సైట్‌ల రూపకల్పన, మొబైల్ అప్లికేషన్, పుస్తక రచనలు, డాక్యుమెంటేషన్ తయారీకి ఎంవోయూ కుర్చుకున్నారు. ఆ దేశంలోని అన్ని రాష్ట్రాల ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్లతో పాటు 45 యూనివర్సిటీల సమన్వయంతో ఈ పనిని చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం శేఖర్ ఇథియోపియా రాజధాని ఇథియోపియాలో ప్రొఫెసర్‌గా...
ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత శేఖర్ 2005 నుంచి 2009 వరకు బెంగళూరులోని పెరుమాళ్ మణిమేఖలై కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అక్కడ ఉండగానే ఇథియోఫియాలో ప్రొఫెసర్‌గా అవకాశం వచ్చింది. ఆయన భార్య ఉమామహేశ్వరి సంపూర్ణ సహకారం అందించి ప్రోత్సహించడంతో ఆ దేశానికి పయనమయ్యారు.
ప్రాంతీయ భాషలపై పట్టు
ఇథియోపియా వెళ్లిన శేఖర్ 6నెలల వ్యవధిలోనే ఆ దేశ జాతీయ భాష అమ్హారిక్‌పై పట్టు సాధించారు. సుమారు 84 భాషలను ఆ దేశం జాతీయ భాషలుగా ఎంపిక చేసినప్పటికీ వాటన్నింటికీ కలిపి ఒకేఒక్క లిపి మాత్రమే ఉండేది. ఈ పరిస్థితుల్లో అవి కనుమరుగయ్యే ప్రమాదంలో పడటంతో వాటి డాక్యుమెంటేషన్, వెబ్‌సైట్, డిజిటలైజేషన్, పుస్తక రచనలు చేసేందుకు పూనుకున్నారు. తొలుత ‘స్పీక్ అమ్హారిక్ లాంగ్వేజ్- దట్ గోస్ టు ద హార్ట్స్ ఇథియోఫియన్స్’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని ప్రచురించేందుకు ఎవరూ ముందుకురాలేదు. చివరకు ఓ పబ్లిషర్ అమ్హారిక్ భాషాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకానికి మంచి ఆదరణ లభించడంతో ఆ తర్వాత హాడియా భాషలో మరో పుస్తకాన్ని రచించారు. ఈ విధంగా ఇప్పటి వరకు 14 భాషలకు సంబంధించి పుస్తకాలను, డాక్యుమెంటేషన్, వెబ్‌సైట్‌లు, మొబైల్ అప్లికేషన్లు వంటివి తయారు చేశారు. మరో 70 ప్రాంతీయ భాషలను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వ గుర్తింపుతో అవకాశాలు
ఇథియోపియా భాషాభివృద్ధి కోసం డాక్టర్ కే.శేఖర్ రచించిన పుస్తకాలను తొలుత వ్యతిరేకించిన ఆ దేశ ప్రభుత్వం... తమ భాష పట్ల చూపిన అభిమానాన్ని గుర్తించి ఆయనకు చక్కటి అవకాశాలను కల్పించింది. ఇథియోఫియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు శేఖర్ సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రాంతీయ భాషల అభివృద్ధిలో భాగంగా ఆయా భాషల డిజిటలైజేషన్ ప్రక్రియ, వెబ్‌సైట్‌ల రూపకల్పన, మొబైల్ అప్లికేషన్, పుస్తక రచనలు, డాక్యుమెంటేషన్ తయారీకి ఎంవోయూ కుర్చుకున్నారు. ఆ దేశంలోని అన్ని రాష్ట్రాల ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్లతో పాటు 45 యూనివర్సిటీల సమన్వయంతో ఈ పనిని చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం శేఖర్ ఇథియోపియా రాజధాని అడిస్అబాబాలోని వాచెమో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆ వర్సిటీనే కేంద్రంగా భాషల అభివృద్ధికి కృషి చేసేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. డాక్టర్ కే.శేఖర్ ప్రతిభను గుర్తించిన అక్కడి మీడియా సంస్థలు కూడా ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తాయి.
మండేలా మాటలే ప్రేరణ: డాక్టర్ శేఖర్
‘‘ఒక వ్యక్తికి తెలిసిన భాషలో మాట్లాడితే అతని బుద్ధికి మాత్రమే చేరుతుంది. అదే అతని మాతృభాషలో మాట్లాడితే అది అతని హృదయానికి చేరుతుంది’’.. అని నెల్సన్ మండేలా చెప్పిన మాటలు నన్ను ఇథియోఫియా ప్రాంతీయ భాషల అభివృద్ధి దిశగా నడిపించాయి. ఆ దేశంలో అనేక ప్రాంతీయ భాషలు ఉన్నప్పటికీ వాటికి లిపి లేకపోవడంతో చాలావరకు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. వాటిని సంరక్షించడంతో పాటు ఆయా భాషల్లో మాట్లాడే వారికి భాష పట్ల మక్కువ తీసుకురావాలన్న తపనతోనే ఈ ప్రయత్నం చేశాను. ఇప్పటి వరకు 14 భాషలకు సంబంధించిన పుస్తకాలు, మొబైల్ అప్లికేషన్లు, డాక్యుమెంటేషన్లు, వెబ్‌సైట్లను రూపొందించాం. మరో 70 భాషలను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేయడమే లక్ష్యం. ఇథియోపియా ప్రభుత్వం ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది. వాచెమో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆ వర్సిటీనే కేంద్రంగా భాషల అభివృద్ధికి కృషి చేసేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. డాక్టర్ కే.శేఖర్ ప్రతిభను గుర్తించిన అక్కడి మీడియా సంస్థలు కూడా ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తాయి.
మండేలా మాటలే ప్రేరణ: డాక్టర్ శేఖర్
‘‘ఒక వ్యక్తికి తెలిసిన భాషలో మాట్లాడితే అతని బుద్ధికి మాత్రమే చేరుతుంది. అదే అతని మాతృభాషలో మాట్లాడితే అది అతని హృదయానికి చేరుతుంది’’.. అని నెల్సన్ మండేలా చెప్పిన మాటలు నన్ను ఇథియోఫియా ప్రాంతీయ భాషల అభివృద్ధి దిశగా నడిపించాయి. ఆ దేశంలో అనేక ప్రాంతీయ భాషలు ఉన్నప్పటికీ వాటికి లిపి లేకపోవడంతో చాలావరకు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. వాటిని సంరక్షించడంతో పాటు ఆయా భాషల్లో మాట్లాడే వారికి భాష పట్ల మక్కువ తీసుకురావాలన్న తపనతోనే ఈ ప్రయత్నం చేశాను. ఇప్పటి వరకు 14 భాషలకు సంబంధించిన పుస్తకాలు, మొబైల్ అప్లికేషన్లు, డాక్యుమెంటేషన్లు, వెబ్‌సైట్లను రూపొందించాం. మరో 70 భాషలను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేయడమే లక్ష్యం. ఇథియోపియా ప్రభుత్వం ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు