మిస్టర్‌బీస్ట్‌కు 50 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు.. అతడి సంపాదన ఎంతో తెలుసా..
ABN , Publish Date - Jun 13 , 2026 | 09:43 PM
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన మిస్టర్‌బీస్ట్ (MrBeast) తాజాగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన మిస్టర్‌బీస్ట్ (MrBeast) తాజాగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. యూట్యూబ్ చరిత్రలో తొలిసారిగా 500 మిలియన్ సబ్‌స్ర్కైబర్ల (50 కోట్ల మంది)ను పొందిన వ్యక్తిగత కంటెంట్ క్రియేటర్‌గా నిలిచి కొత్త రికార్డు సృష్టించాడు. జూన్ 12, 2026న తన యూట్యూబ్ ఛానల్ లైవ్‌లో ఉన్న సమయంలో మిస్టర్ బీస్ట్ 500 మిలియన్ సబ్‌స్ర్కైబర్లు మార్క్‌ను చేరుకున్నాడు (MrBeast 500 million subscribers).
1998లో అమెరికాలో జన్మించిన జేమ్స్ డొనాల్డ్‌సన్, 2012లో 'మిస్టర్‌బీస్ట్' పేరుతో యూట్యూబ్‌లో ప్రయాణం ప్రారంభించాడు. అప్పుడు అతడి వయసు 13 ఏళ్లు. భారీ బహుమతులు, వినూత్న ఛాలెంజ్‌లు, దాతృత్వ కార్యక్రమాలు, అధిక నిర్మాణ విలువలతో కూడిన వీడియోల ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించాడు. ప్రస్తుతం అతని ప్రధాన ఛానెల్ ప్రపంచంలోనే అత్యధిక సబ్‌స్ర్కైబర్లున్న యూట్యూబ్ ఛానెల్‌గా కొనసాగుతోంది (YouTube record).
మిస్టర్ బీస్ట్ కేవలం యూట్యూబ్ యాడ్స్ ద్వారానే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, మర్చండైజ్ బిజినెస్, ఆయనకు ఉన్న చాక్లెట్ కంపెనీ వంటి వ్యాపారాల ద్వారా భారీగా సంపాదిస్తాడు. అంతర్జాతీయ మీడియా (Forbes, Celebrity Net Worth) కథనాల ప్రకారం, జేమ్స్‌కు వ్యాపారాలు, యూట్యూబ్ ఛానెళ్ల నెట్‌వర్క్ ద్వారా నెలకు సగటున 40 నుంచి 50 మిలియన్ల డాలర్లు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 330 కోట్ల నుంచి రూ. 415 కోట్లు) వరకు ఆదాయం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి..
అదృష్టం అంటే ఈమెదే.. ఒకే వారంలో రెండు లాటరీల గెలుపు..
మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు.. నెస్లే ఇండియా స్పందన ఏంటంటే..