Share News

ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ పార్లమెంటులో స్టాండింగ్ ఒవేషన్

ABN , Publish Date - Feb 25 , 2026 | 09:40 PM

ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ పార్లమెంటులో ఘనస్వాగతం లభించింది. ఇజ్రాయెల్ పార్లమెంటు 'నెస్సెట్'‌ను ఉద్దేశించి మోదీ బుధవారంనాడు ప్రసంగించారు. పార్లమెంటు హాలులోకి మోదీ ప్రవేశించగానే సభ్యులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో మోదీకి స్వాగతం పలికారు.

ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ పార్లమెంటులో స్టాండింగ్ ఒవేషన్
PM Modi in Israeli Parliament.

టెల్ అవివ్: ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ పార్లమెంటులో ఘనస్వాగతం లభించింది. ఇజ్రాయెల్ పార్లమెంటు 'నెస్సెట్'‌ను ఉద్దేశించి మోదీ బుధవారంనాడు ప్రసంగించారు. పార్లమెంటు హాలులోకి మోదీ ప్రవేశించగానే సభ్యులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో మోదీకి స్వాగతం పలికారు. 'మోదీ... మోదీ' నినాదాలు హోరెత్తించారు. సాధారణంగా అమెరికా అధ్యక్షుడు వంటి అత్యంత కీలక మిత్రదేశాల అధినేతలకు మత్రమే దక్కే ఈ అరుదైన గౌరవం భారత ప్రధానికి దక్కడం విశేషం.


నెస్సెట్ స్పీకర్ అమీర్ ఒహానా మాట్లాడుతూ, నెస్సెట్‌ స్పీకర్‌గా సభలో ప్రసంగించనున్న తొలి ప్రధానిని ఆహ్వానించే అవకాశం దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. 'థాంక్యూ ప్రైమ్ మినిస్టర్ మోదీ' అంటూ హర్షాతిరేకం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

24 ఏళ్ల క్రితం మిస్సింగ్.. ఇప్పటికీ అంతు చిక్కని కారణం

ఎప్‌స్టీన్ సంబంధాలపై ఫౌండేషన్ సిబ్బందికి బిల్ గేట్స్ క్షమాపణలు

Updated Date - Feb 25 , 2026 | 09:45 PM