ఖమేనీ మృతి.. పాకిస్థాన్‌లో అమెరికన్ కాన్సులేట్‌పై దాడి..
ABN , Publish Date - Mar 01 , 2026 | 01:23 PM
ఖమేనీ హత్యను నిరసిస్తూ అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఖమేనీ సానుభూతిపరులు, మద్దతుదారులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌లోని కరాచీలో యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్‌పై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఖమేనీ సానుభూతిపరులు, మద్దతుదారులు ఆగ్రహానికి గురవుతున్నారు. ఖమేనీ హత్యను నిరసిస్తూ అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌లోని కరాచీలో యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్‌పై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. ఆదివారం మధ్యాహ్నం అమెరికన్ కాన్సులేట్‌పై కొందరు రాళ్లు రువ్వారు. మరికొందరు మెయిన్ బిల్డింగ్ లోపలికి చొరబడి కర్రలతో కిటికీలు, తలుపులకు ఉన్న అద్దాలను ధ్వంసం చేశారు.
పోలీసులు వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. భారీ సంఖ్యలో ఆందోళనకారులు అమెరికన్ కాన్సులేట్‌లోకి చొరబడుతున్న దృశ్యాల తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ఆందోళనకారులు పెద్ద పెద్ద కర్రలు, రాళ్లతో గుంపులు, గుంపులుగా అమెరికన్ కాన్సులేట్‌లోకి చొరబడ్డారు. తలుపులు, కిటికీలకు ఉన్న అద్దాలను ధ్వంసం చేశారు.
ఇవి కూడా చదవండి
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. ప్రపంచ వ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు!