Share News

ఎన్విడియా సీఈఓ ఎఫైర్.. ఆమెతో తమకు సంబంధం లేదన్న సింగపూర్ సంస్థ

ABN , Publish Date - Nov 15 , 2026 | 04:50 PM

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో వివాహేతర సంబంధంలో ఉన్న చైనా మహిళ ఆలిస్‌ తమ వద్ద పనిచేయట్లేదని సింగపూర్‌ సంస్థ మెగాస్పీడ్ పేర్కొంది.

ఎన్విడియా సీఈఓ ఎఫైర్.. ఆమెతో తమకు సంబంధం లేదన్న సింగపూర్ సంస్థ
Megaspeed about Alice Huang

ఇంటర్నెట్ డెస్క్: ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో వివాహేతర సంబంధంలో ఉన్న చైనా మహిళ ఆలిస్‌ తమ వద్ద పనిచేయట్లేదని సింగపూర్‌ సంస్థ మెగాస్పీడ్ పేర్కొంది. ఆమె తమ సంస్థను 2025 ఆగస్టు 30నే వీడినట్టు తెలిపింది. ప్రస్తుతం ఆమె తమ సంస్థలో ఎలాంటి బాధ్యతలు నిర్వహించట్లేదని చెప్పుకొచ్చింది. సీఈఓ జెన్సన్‌తో సాన్నిహిత్యాన్ని ఆసరగా చేసుకుని ఆలిస్ ఎన్విడియా కంప్యూటర్ చిప్స్‌ను మెగాస్పీడ్ సంస్థ ద్వారా చైనాకు తరలించిందన్న అనుమానాలుఉన్న విషయం తెలిసిందే.


ఈ ఉదంతానికి సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు తమ దృష్టికి వచ్చాయని మెగాస్పీడ్ తెలిపింది. అయితే, ఇందుకు సంబంధించి ఆధారాలు వెల్లడి కాలేదని పేర్కొంది. తాము చట్టప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపింది. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ కోసం లీగల్ సలహాదారుల సాయం తీసుకుంటున్నామని కూడా చెప్పింది. ఇక ఆలిస్ వ్యక్తిగత జీవితం గురించి తాము మాట్లాడబోమని కూడా స్పష్టం చేసింది.


ఇదిలా ఉంటే, దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎన్విడియాను ముందుండి నడిపించిన జెన్సన్‌ను మళ్లీ సంస్థలో తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ కూడా వీరికి మద్దతు పలికారు. జెన్సన్ రీఎంట్రీ పిటిషన్‌పై సంతకం చేస్తానని కూడా చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

మియామి ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ.. ఇద్దరికి గాయాలు

చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..

Updated Date - Nov 15 , 2026 | 05:13 PM