Share News

నీరవ్ మోదీకి షాక్.. రూ. 108 కోట్లు చెల్లించాల్సిందేనన్న లండన్ కోర్టు..

ABN , Publish Date - Jun 24 , 2026 | 09:10 PM

ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి లండన్ సర్క్యూట్ కమర్షియల్ కోర్టు షాక్ ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 11.5 మిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో దాదాపు 108 కోట్ల రూపాయలు) బకాయిలు చెల్లించాలని ఆదేశించింది.

నీరవ్ మోదీకి షాక్.. రూ. 108 కోట్లు చెల్లించాల్సిందేనన్న లండన్ కోర్టు..
Bank of India

ఇంటర్‌నెట్ డెస్క్: ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి లండన్ సర్క్యూట్ కమర్షియల్ కోర్టు షాక్ ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 11.5 మిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో దాదాపు 108 కోట్ల రూపాయలు) బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. దుబాయ్‌కు చెందిన 'ఫైర్‌స్టార్ డైమండ్ ఎఫ్‌జెడ్ఈ' అనే కంపెనీకి నీరవ్ మోదీ అసోసియేట్‌గా ఉన్నారు. ఈ కంపెనీ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణం తీసుకోవడానికి నీరవ్ మోదీ తన వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చారు. ఫైర్‌స్టార్ డైమండ్ ఎఫ్‌జెడ్ఈ దివాళా తీయటంతో ఆ కంపెనీ తీసుకున్న అప్పు.. పూచీకత్తు ఇచ్చిన నీరవ్ మోదీపై పడింది.


అయితే, ఆయన అప్పు తిరిగి చల్లించలేదు. ఇండియా నుంచి లండన్ పారిపోయారు. దీంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ రికవరీ కోసం 2018లో లండన్ కోర్టును ఆశ్రయించింది. అప్పటినుంచి లండన్ కోర్టులో కేసు నడుస్తోంది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియాకు విజయం దక్కింది. 2026 మార్చి వరకు వడ్డీతో కలిపి 11.5 మిలియన్ డాలర్లు చెల్లించాలని లండన్ సర్క్యూట్ కమర్షియల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సైమన్ టింక్లర్ తుది తీర్పును వెలువరించారు.


కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకుని మోసగించిన కేసులో నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ ప్రస్తుతం బ్రిటన్‌ జైల్లో ఉన్నారు. నీరవ్ మోదీ కేసులో సీబీఐ దర్యాప్తు చేపడుతోంది. ఆయనను భారత్‌కు రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఆయనపై పలు కేసులు ఉండటంతో ఈడీ కూడా దర్యాప్తు జరుపుతోంది.


ఇవి కూడా చదవండి

వైభవ్ సూర్యవంశీ తమ్ముడు మరో భారీ సెంచరీ

80 ఏళ్ల వయసులో కళాకారుడి కష్టాలు.. వీడియో చూసి చలించిపోయిన ఆనంద్ మహీంద్ర..

Updated Date - Jun 24 , 2026 | 09:10 PM