Share News

నేపాల్‌ మాజీ ప్రధాని ఓలీ అరెస్టు

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:33 AM

సీపీఎన్‌-యూఎంఎల్‌ నేత, నేపాల్‌ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బాలేంద్రషా సారథ్యంలో కొత్త సర్కారు కొలువు దీరిన...

నేపాల్‌ మాజీ ప్రధాని ఓలీ అరెస్టు

  • బాలేంద్రషా సర్కారు కొలువు దీరిన మరునాడే

ఖాఠ్మండు, మార్చి 28: సీపీఎన్‌-యూఎంఎల్‌ నేత, నేపాల్‌ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బాలేంద్రషా సారథ్యంలో కొత్త సర్కారు కొలువు దీరిన మరునాడే ఓలీని నేపాల్‌ పోలీసులు అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. గతేడాది జెన్‌-జడ్‌ ఉద్యమ అణచివేతపై ఏర్పాటైన విచారణ కమిషన్‌ నివేదికను శుక్రవారం సమావేశమైన బాలేంద్ర షా క్యాబినెట్‌.. తక్షణం ఆ నివేదికను అమలు చేయాలని నిర్ణయించింది. నేపాల్‌ హోంశాఖ మాజీ మంత్రి రమేశ్‌ లేఖక్‌నూ పోలీసులు అరెస్టు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా గతేడాది సెప్టెంబరు 8,9 తేదీల్లో జరిగిన జెన్‌-జడ్‌ ఉద్యమాన్ని కఠినంగా అణచివేశారన్న అభియోగాలపై వారిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ‘ఎవరూ చట్టానికతీతులు కారు. ఏ ఒక్కరి పట్ల మాకు కక్ష సాధింపు లేదు. కేవలం న్యాయ ప్రక్రియ ప్రారంభం మాత్రమే’ అని నేపాల్‌ కొత్త హోంమంత్రి సుదాన్‌ గురుంగ్‌ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి...

సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు

అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 29 , 2026 | 06:33 AM