Share News

మేం లేకపోతే మీరు ఫ్రెంచ్‌ మాట్లాడేవారు

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:09 AM

ఎదుటివారిని ఏదొకటి అనడం, వారితో తిరిగి అనిపించుకోవడం ట్రంప్‌నకు అలవాటు. గతంలో బ్రిటన్‌ను ఉద్దేశించి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు..

మేం లేకపోతే మీరు ఫ్రెంచ్‌ మాట్లాడేవారు

  • ట్రంప్‌నకు బ్రిటన్‌ రాజు చార్లెస్‌ చురకలు

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 29: ఎదుటివారిని ఏదొకటి అనడం, వారితో తిరిగి అనిపించుకోవడం ట్రంప్‌నకు అలవాటు. గతంలో బ్రిటన్‌ను ఉద్దేశించి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3 చరిత్ర గుర్తు చేస్తూ తాజాగా గట్టి కౌంటర్‌ ఇచ్చారు. మంగళవారం నాడు వైట్‌హౌ్‌సలో ఏర్పాటు చేసిన డిన్నర్‌ కార్యక్రమంలో చార్లెస్‌ సరదాగా మాట్లాడుతూనే చురకలు అంటించారు. ‘‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌. అమెరికా లేకపోతే యూరప్‌ దేశాల వారు జర్మన్‌ మాట్లాడేవారని ఇటీవల మీరు చెప్పారు. అయితే, మేము లేకపోతే మీరు ఫ్రెంచ్‌ మాట్లాడాల్సి వచ్చేది అని నేను చెప్పవచ్చా’’ అంటూ చార్లెస్‌ చమత్కరించారు. అమెరికాకు స్వాతంత్య్రం రాకముందు కొలోనియల్‌ కాలంలో ఉత్తర అమెరికాపై ఆధిపత్యం కోసం బ్రిటన్‌, ఫ్రాన్స్‌ పోరాటాల్ని గుర్తుచేసేలా కింగ్‌ ఆ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జనవరిలో ప్రపంచ ఆర్థిక సదస్సులో ట్రంప్‌ మాట్లాడుతూ, రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోకపోతే యూరప్‌ దేశాలు జర్మన్‌, కొద్దిగా జపనీ్‌సను మాట్లాడుతూ ఉండేవారు అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కింగ్‌ చార్లెస్‌ ప్రతిస్పందించారు. వైట్‌హౌ్‌సలో డిన్నర్‌కు ముందు కింగ్‌ చార్లెస్‌ కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో మాట్లాడారు.

ఈ వార్తలు కూడా చదవండి:

అనంతపురం మీదుగా తిరుపతికి రైలు

రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 30 , 2026 | 05:14 AM