ప్రెస్ డిన్నర్‌లో కాల్పులు.. ముందు రోజు రెక్కీ నిర్వహించిన నిందితుడు..
ABN , Publish Date - May 01 , 2026 | 11:56 AM
ప్రెస్ డిన్నర్ సందర్భంగా విధుల్లో ఉన్న సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్‌పై.. కాలిఫోర్నియాకు చెందిన 31 ఏళ్ల కోల్ థామస్ ఎలెన్ కాల్పులు జరిపిన దృశ్యాల తాలూకా వీడియోను యూఎస్ అటార్నీ శుక్రవారం విడుదల చేసింది.
న్యూయార్క్, మే1: వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ ఏప్రిల్ 24వ తేదీ రాత్రి ఏర్పాటు చేసిన యాన్యువల్ ప్రెస్ డిన్నర్ సందర్భంగా కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాకు చెందిన 31 ఏళ్ల కోల్ థామస్ ఎలెన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపాలని తుపాకితో వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లోకి చొరబడ్డాడు. డిన్నర్ జరుగుతున్న బాల్‌రూము వైపు పరుగులు తీశాడు. సీక్రెట్ ఏజెంట్‌లు, భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే కోల్ ఓ అధికారిపై కాల్పులు జరిపాడు. ఆ అధికారి గాయపడ్డారు.
వీడియో రిలీజ్ చేసిన యూఎస్ అటార్నీ..
ప్రెస్ డిన్నర్ సందర్భంగా విధుల్లో ఉన్న సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్‌పై.. కోల్ థామస్ ఎలెన్ కాల్పులు జరిపిన దృశ్యాల తాలూకా వీడియోను యూఎస్ అటార్నీ విడుదల చేసింది. ఈ మేరకు ‘యూఎస్ అటార్నీ ఫర్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా’ జీనైన్ పిర్రో తన ఎక్స్ ఖాతాలో శుక్రవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో..
‘వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వద్ద అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసే ప్రయత్నంలో.. నిందితుడు కోల్ అలెన్ ఓ సీక్రెట్ సర్వీస్ అధికారిపై కాల్పులు జరుపుతున్నట్లు ధ్రువీకరించే వీడియోను ఈ రోజు మేము విడుదల చేస్తున్నాము. ఈ వీడియోను ఇప్పటికే యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టుకు సమర్పించాము. ఈ కాల్పులు 'ఫ్రెండ్లీ ఫైర్' (సొంత దళాల పొరపాటు కాల్పులు) వల్ల జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అంతేకాకుండా, దాడికి ఒక రోజు ముందు హిల్టన్ హోటల్‌లో అలెన్ రెక్కీ నిర్వహిస్తున్న దృశ్యాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి’ అని రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
భగ్గుమన్న భానుడు.. వేలూరులో అత్యధికంగా 42.4 డిగ్రీలు
లంచం అడిగిన ఆర్టీసీ అధికారి.. చెప్పుతో కొట్టిన కండక్టర్