Share News

ట్రంప్, నెతన్యాహూకు ఖమేనీ డెడ్‌బాడీ ఫొటో.. ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు..

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:47 PM

ఖమేనీ మృతిని ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించడానికంటే కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్‌కు చెందిన రెండు ప్రముఖ టీవీ ఛానళ్లు ఖమేనీ మృతిపై సంచలన విషయాలు ప్రసారం చేశాయి. ఖమేనీ డెడ్‌బాడీ ఫొటోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ చూశారని పేర్కొన్నాయి.

ట్రంప్, నెతన్యాహూకు ఖమేనీ డెడ్‌బాడీ ఫొటో.. ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు..
Khamenei body photo

ఇంటర్‌నెట్ డెస్క్: ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కూతురు, అల్లుడు, మనవరాలు కూడా చనిపోయారు. ఖమేనీ మృతిని ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించడానికంటే కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్‌కు చెందిన రెండు ప్రముఖ టీవీ ఛానళ్లు ఖమేనీ మృతిపై సంచలన విషయాలు ప్రసారం చేశాయి. ఖమేనీ డెడ్‌బాడీ ఫొటోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ చూశారని పేర్కొన్నాయి.
khameni-2.jpg


‘ఖమేనీ చనిపోయాడని ఇజ్రాయెల్ సీనియర్ అధికారులకు సమాచారం అందింది. ఇంటి కాంపౌండ్ ఏరియాలో శిథిలాల మధ్య ఖమేనీ మ‌ృతదేహాన్ని గుర్తించారు. ఖమేనీ డెడ్‌బాడీ ఫొటోను ట్రంప్, నెతన్యాహూలకు చూపించారు’ అని ఇజ్రాయెల్ పబ్లిక్ బ్రాడ్‌క్యాస్టర్ కాన్ వెల్లడించింది. ఖమేనీ మృతిపై ఇరాన్ కంటే ముందుగానే ట్రంప్, నెతన్యాహూలు స్పందించారు. ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ది ట్రూత్‌లో ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. ‘చరిత్రలోనే అత్యంత భయంకరమైన వ్యక్తి ఖమేనీ చనిపోయాడు. ఖమేనీ కారణంగా.. అతడి గ్యాంగ్ కారణంగా అత్యంత దారుణంగా హత్యకు గురైన ఇరాన్, అమెరికా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దేశాల ప్రజలకు న్యాయం జరిగింది’ అని రాసుకొచ్చారు.

khameni.jpg


వైరల్‌గా మారిన ఖమేనీ డెడ్‌బాడీ ఫొటో..

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతదేహానికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో.. శిథిలాల కింద ఉన్న ఖమేనీ మృతదేహాన్ని సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే, ఆ ఫొటో రియలా? ఫేకా? అన్నది తెలియరాలేదు. కానీ, సోషల్ మీడియా మాత్రం ఈ ఫొటో బాగా వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి

టీ20 డబ్ల్యూసీ: విండీస్‌తో పదేళ్ల నాటి పగ.. తీర్చుకునేందుకు సూర్య సేన రెడీ

పెళ్లి ముచ్చట మారింది!

Updated Date - Mar 01 , 2026 | 01:32 PM