మరోసారి బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడులు.. హెజ్‌బొల్లా స్థావరాలే టార్గెట్..
ABN , Publish Date - Jun 14 , 2026 | 07:11 PM
లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ మరోసారి భారీ వైమానిక దాడులు నిర్వహించింది. నగరంలోని దక్షిణ శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయాలు, సైనిక మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ మరోసారి భారీ వైమానిక దాడులు నిర్వహించింది. నగరంలోని దక్షిణ శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయాలు, సైనిక మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దాడుల అనంతరం పలుచోట్ల భారీ పొగలు ఎగసిపడగా ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి (Israel Beirut airstrike).
హెజ్‌బొల్లా కేంద్రాల నుంచి ఇజ్రాయెల్ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్య చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ పేర్కొన్నారు. తమ దేశ భద్రతకు ముప్పుగా ఉన్న లక్ష్యాలపై మాత్రమే దాడులు చేస్తున్నామని వారు తెలిపారు. హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయం అయిన బీరుట్‌లోని ఒక భవనంపై సైన్యం దాడి చేస్తున్న వీడియోను ఇజ్రాయెల్ వైమానిక దళం ఎక్స్‌లో పోస్ట్ చేసింది (Hezbollah headquarters).
బీరుట్ దక్షిణ శివారు ప్రాంతమైన దహియెహ్ (Dahiyeh)ను హెజ్‌బొల్లా ప్రధాన స్థావరంగా ఇజ్రాయెల్ చెబుతోంది (Israel Hezbollah war). ఈ ప్రాంతంలో ఉన్న భవనాలు, కమాండ్ సెంటర్లు, ఆయుధ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న సమయంలో బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఐదేళ్లుగా విడాకుల కోసం పోరాటం.. చివరకు కోర్టులో న్యాయూమర్తి ఎదుట కౌగిలించుకుని..
మరింత ఎక్కువగా రష్యా చమురు.. మేలో గణనీయంగా పెరిగిన దిగుమతులు..