Share News

గొడ్డలితో అమెరికా సైనిక విమానం ధ్వంసం!

ABN , Publish Date - Nov 19 , 2026 | 03:10 AM

అమెరికా మిలటరీ విమానంలోకి ఐరిష్‌ వ్యక్తి ప్రవేశించి గొడ్డలి, రసాయనాలతో ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి అభియోగాలు నమోదయ్యాయి.

గొడ్డలితో అమెరికా సైనిక విమానం ధ్వంసం!
aeroplane attack

  • ఐరిష్‌ వ్యక్తి ఘాతుకం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో ఘటన

నూఢిల్లీ, నవంబరు 18: అమెరికా మిలటరీ విమానంలోకి ఐరిష్‌ వ్యక్తి ప్రవేశించి గొడ్డలి, రసాయనాలతో ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి అభియోగాలు నమోదయ్యాయి. నిందితుడు 48 ఏళ్ల దైతి ఓకరైన్‌ అలియాస్‌ డేవిడ్‌ కరన్‌. గత ఏప్రిల్‌ 11న తెల్లవారుజామున 4:40 గంటల సమయంలో డేవిడ్‌ పథకం ప్రకారం ఐర్లాండ్‌లోని షనాన్‌ విమానాశ్రయం కంచెను దాటుకొని లోపలికి పవేశించాడు.. అక్కడ నిలిపి ఉంచిన యూఎస్‌ ఎయిర్‌ నేషనల్‌ గార్డ్‌ సీ-130 హెర్క్యులస్‌ కార్గో విమానం వెనుక ద్వారం తాళాన్ని బద్దలు కొట్టి ఫ్లైట్‌లోకి ప్రవేశించాడు. విమానం లోపల వైర్లు, హైడ్రాలిక్‌ లైన్లు కట్‌ చేశాడు. కాక్‌పీట్‌లోకి ప్రవేశించి గొడ్డలితో మీటర్లన్నింటినీ పగులగొట్టాడు. ఫ్యూయల్‌ ట్యాంకుల్లో బాల్‌ బేరింగ్‌లు పోశాడు. అల్యూమినియం, ఉక్కును కరిగించే గాలియం అనే రసాయనాన్ని విమానం భాగాలపై చల్లాడు. విమానం పైకప్పు ద్వారా బయటకొచ్చి గొడ్డలితో విమానం బాడీని, రెక్కలను ధ్వంసం చేశాడు. ఉదయం 9:30 గంటలకు భద్రతా సిబ్బంది డేవిడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. డేవిడ్‌ విధ్వంసంతో రూ.500-560 కోట్ల విమానం ఏమాత్రం పనిచేయని స్థితికి చేరుకుందని అమెరికా అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..

జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్‌.. కొట్టివేసిన సుప్రీంకోర్టు

Updated Date - Nov 19 , 2026 | 03:45 AM