Share News

ప్రతీకారం తప్పదు.. ఉక్రెయిన్‌కు ఇరాన్ తీవ్ర హెచ్చరిక..

ABN , Publish Date - Jul 27 , 2026 | 02:03 PM

కాస్పియన్ సముద్రంలో తమ నౌకపై ఉక్రెయిన్ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకపై ఉక్రెయిన్‌ చేసిన దాడిలో ఒక నావికుడు మరణించగా, మరకొరు గాయపడ్డారు.

ప్రతీకారం తప్పదు.. ఉక్రెయిన్‌కు ఇరాన్ తీవ్ర హెచ్చరిక..
Iran Ukraine conflict

కాస్పియన్ సముద్రంలో తమ నౌకపై ఉక్రెయిన్ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకపై ఉక్రెయిన్‌ చేసిన దాడిలో ఒక నావికుడు మరణించగా, మరకొరు గాయపడ్డారు. ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు విరుద్ధమైన చర్యగా అభివర్ణించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, దీనికి తగిన ప్రతీకారం తప్పదని స్పష్టం చేశారు (Iran Ukraine conflict).


కాస్పియన్ సముద్రంలో ప్రయాణిస్తున్న ఇరాన్ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ దాడి చేసింది. ఈ దాడి కారణంగా భారీ పేలుడు సంభవించి ఒక నావికుడు మరణించగా, మరో వ్యక్తి గాయపడ్డారు. ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన టెహ్రాన్, ఉక్రెయిన్ దౌత్య ప్రతినిధిని పిలిపించి వివరణ కోరింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పందిస్తూ.. 'ఈ దాడికి తగిన సమాధానం చెబుతాం' అని అన్నారు (Caspian Sea strike).


ఇజ్రాయెల్ చెప్పడంతోనే ఉక్రెయిన్ ఈ చర్యకు పాల్పడిందని, యూరప్‌ను విస్తృత యుద్ధంలోకి లాగడమే ఈ దాడి వెనుక ఉద్దేశమని అరాఘ్చీ వ్యాఖ్యానించారు (Iran retaliation). కాగా, రష్యాకు సైనిక సామగ్రి తరలిస్తున్న నౌకలపై తమ బలగాలు దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. కాస్పియన్ సముద్ర మార్గాన్ని రష్యా-ఇరాన్ సైనిక సహకారం కోసం ఉపయోగిస్తున్నారని, అందుకే ఈ దాడులు చేపట్టామని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

బెర్లిన్ ప్రైడ్ వేడుకపై ఉగ్రదాడి.. ఇస్లామిక్ తీవ్రవాద కోణంలో జర్మనీ దర్యాప్తు..


పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 27 , 2026 | 03:00 PM