Share News

ఎవరీ కరీనా షులియాక్.. ఎప్‌స్టీన్ ఆస్తిలో రూ.850 కోట్లకుపైగా ఆమెకు దక్కుతోందా..

ABN , Publish Date - Jul 27 , 2026 | 11:27 AM

అమెరికాను కుదిపేస్తున్న లైంగిక నేరాల దోషి జెఫ్రీ ఎప్‌స్టీన్ మరణించి ఏడు సంవత్సరాలు దాటినప్పటికీ ఆయన ఆస్తుల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఓ వీలునామా తాజాగా బయటకు వచ్చింది.

ఎవరీ కరీనా షులియాక్.. ఎప్‌స్టీన్ ఆస్తిలో రూ.850 కోట్లకుపైగా ఆమెకు దక్కుతోందా..
Epstein girlfriend

అమెరికాను కుదిపేస్తున్న లైంగిక నేరాల దోషి జెఫ్రీ ఎప్‌స్టీన్ మరణించి ఏడు సంవత్సరాలు దాటినప్పటికీ ఆయన ఆస్తుల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఓ వీలునామా తాజాగా బయటకు వచ్చింది. ఎప్‌స్టీన్‌కు అత్యంత సన్నిహితురాల అయిన దంత వైద్యురాలు కరీనా షులియాక్ ఆయన ఆస్తిలో 100 మిలియన్ డాలర్ల వరకు (సుమారు రూ.850 కోట్లకుపైగా) పొందే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. అలాగే ఆమెకు 33 క్యారెట్ల వజ్రపు ఉంగరాన్ని కూడా ఇవ్వాలని ఆయన వీలునామాలో పేర్కొన్నట్లు సమాచారం (Epstein girlfriend Karyna Shuliak).


కరీనా షులియాక్ బెలారస్‌కు చెందిన దంత వైద్యురాలు. 2010లో విద్యార్థి వీసాతో అమెరికాకు వెళ్లిన ఆమె, న్యూయార్క్‌లో దంత సహాయకురాలిగా పనిచేస్తూ తన చదువును కొనసాగించింది. 2011లో ఎప్‌స్టీన్‌ను కలిసిన తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఆ సంబంధం దాదాపు ఎనిమిదేళ్ల పాటు కొనసాగినట్లు తాజాగా విడుదలైన దర్యాప్తు పత్రాలు వెల్లడించాయి.


దర్యాప్తు పత్రాల ప్రకారం, కరీనా దంత వైద్య విద్య పూర్తిచేయడానికి ఎప్‌స్టీన్‌ ఆర్థికంగా సహకరించారు. ఆమె విద్యా ఖర్చులు భరించడమే కాకుండా, కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక సాయం చేశాడని సమాచారం. తర్వాత ఆమె న్యూయార్క్‌లో దంత వైద్యురాలిగా లైసెన్స్ కూడా పొందింది. 2019 ఆగస్టు 10న జైలులో మరణించే ముందు ఎప్‌స్టీన్ చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడింది కూడా కరీనాతోనే కావడం విశేషం (Belarus dentist).


మరణానికి రెండు రోజుల ముందు రూపొందించిన వీలునామాలో కరీనా షులియాక్‌కు 100 మిలియన్ డాలర్లు, 33 క్యారెట్ల వజ్రపు ఉంగరం ఇవ్వాలని ఎప్‌స్టీన్ పేర్కొన్నారు (Jeffrey Epstein will). అయితే ఎప్‌స్టీన్ బాధితులకు పరిహారాలు, న్యాయవ్యయాలు, ఇతర చెల్లింపుల కారణంగా ఆస్తుల విలువ గణనీయంగా తగ్గింది. అందువల్ల కరీనాకు చివరకు ఎంత మొత్తం అందుతుందో ఇంకా స్పష్టత లేదు.


ఇవి కూడా చదవండి..

బెర్లిన్ ప్రైడ్ వేడుకపై ఉగ్రదాడి.. ఇస్లామిక్ తీవ్రవాద కోణంలో జర్మనీ దర్యాప్తు..


పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 27 , 2026 | 11:30 AM