ఇరాన్ యుద్ధం వల్ల మూడు కోట్ల మంది పేదరికంలోకి.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక..
ABN , Publish Date - Apr 23 , 2026 | 09:52 PM
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అంతరాయం వల్ల కోట్లాది మంది ప్రజలు పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అంతరాయం వల్ల కోట్లాది మంది ప్రజలు పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP) అధికారి అంచనా ప్రకారం.. ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉంది (Iran war poverty impact).
హోర్ముజ్‌లో అంతరాయం వల్ల ఇంధనం, ఎరువుల సరఫరా తీవ్రంగా దెబ్బతింది. ప్రపంచ ఎరువుల సరఫరాలో అధిక భాగం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. అలాంటి మార్గంలో అంతరాయం ఏర్పడడంతో ఎరువుల కొరత మరింత తీవ్రమై, వ్యవసాయ ఉత్పాదకత ఇప్పటికే తగ్గిపోయిందని యూఎన్‌డీపీ నిర్వాహకుడు తెలిపారు. ఈ ఏడాది చివర్లో పంట దిగుబడులపై ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అన్నారు (Strait of Hormuz crisis poverty).
కొన్ని నెలల్లో ఆహార కొరత గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఆయన చెప్పారు. యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగిపోయినా కూడా, ఆ ప్రభావం ఇప్పటికే అందరిపై పడిందని, 3 కోట్ల మందికి పైగా ప్రజలను పేదరికంలోకి నెట్టివేస్తుందని చెప్పారు. ప్రపంచంలోని ఎరువుల ఉత్పత్తిలో అధిక భాగం పశ్చిమాసియా దేశాల్లోనే జరుగుతుంది. ప్రపంచ ఎరువుల సరఫరాలలో మూడింట ఒక వంతు హోర్ముజ్ జలసంధి గుండా జరుగుతుంది (UN warning Iran war).
ఇరాన్ యుద్ధం ప్రపంచ జీడీపీలో సుమారు 0.5% నుంచి 0.8% వరకు తుడిచిపెట్టేసిందని అన్నారు (world economy Iran conflict). దశాబ్దాలుగా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను నాశనం చేయడానికి ఎనిమిది వారాల యుద్ధం సరిపోతుందని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి..
శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్
నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి