Share News

తృటిలో తప్పించుకున్న ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ!

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:24 PM

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ, అమెరికా జరిపిన ఒక భారీ వైమానిక దాడి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కొన్ని సెకన్ల తేడాతో మృత్యువును జయించారు.

తృటిలో తప్పించుకున్న ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ!
Mojtaba Khamenei

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 17: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్న వేళ ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ.. అమెరికా జరిపిన ఒక భారీ వైమానిక దాడి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కొన్ని సెకన్ల తేడాతో మృత్యువును జయించిన ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

అసలేం జరిగిందంటే.?

అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. మొజ్తబా ఖమేనీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా డ్రోన్ లేదా వైమానిక దాడి జరిపినట్లు తెలుస్తోంది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఆ ప్రాంతాన్ని దాటి వెళ్లిన కొన్ని క్షణాల్లోనే క్షిపణులు అక్కడ పడ్డాయి. ఈ దాడిలో మొజ్తబా ప్రయాణించిన మార్గంలోని భవనాలు, వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఒకవేళ కాన్వాయ్ మరికొన్ని సెకన్లు ఆలస్యమై ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


ఎవరీ మొజ్తబా ఖమేనీ?

ఇటీవల మరణించిన ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడే మొజ్తబా ఖమేనీ. ఇరాన్ రాజకీయాల్లో, సైనిక విభాగమైన 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC)'లో ఈయనకు బలమైన పట్టుంది. ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టాక.. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఈయనకు ముప్పు పెరిగింది. ఈ దాడి విఫలమైనప్పటికీ.. ఇది ఇరాన్, అమెరికా మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. తమ నేతపై జరిగిన తాజా దాడికి ఇరాన్ తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

గ్యాస్ లేదని ఎలక్ట్రిక్ స్టవ్ కొన్నాడు.. తీరా కూర ఉడికే ముందు చూసి ఖంగుతిన్నాడు..

వీరి తెలివి మామూలుగా లేదుగా.. రైల్వే ఏసీ కోచ్‌‌ను ఎలా మార్చారో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 17 , 2026 | 02:17 PM