Share News

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. నిర్ధారించిన ఇరాన్ సైన్యం

ABN , Publish Date - Mar 01 , 2026 | 07:25 AM

ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. ఈ విషయాన్ని ఇరాన్ సైన్యం ధ్రువీకరించింది.

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. నిర్ధారించిన ఇరాన్ సైన్యం
Ali Khamenei

టెహ్రాన్, మార్చి 1: ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. ఈ విషయాన్ని ఇరాన్ సైన్యం ధ్రువీకరించింది. ఇరాన్‌కు చెందిన పలు మీడియా సంస్థలు కూడా ఖమేనీ చనిపోయాడని నిర్ధారిస్తూ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. శనివారం ఇజ్రాయెల్-అమెరికా దళాలు టెహ్రాన్‌లోని మొత్తం 30 ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్‌ నాయకులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. శనివారం జరిగిన ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది.


ఇరాన్‌లో మారణహోమం..

ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో పెద్ద సంఖ్యలో ఇరాన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు 201 మంది మృతి చనిపోయినట్లు ఇరాన్ ప్రకటించింది. ఓ పాఠశాలపై జరిగిన దాడిలో 160 మంది విద్యార్థులు మృతి చెందారని వెల్లడించింది. ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్‌కు చెందిన ఇద్దరు ప్రముఖులు కూడా మృతి చెందారు. ఇరాన్‌ రక్షణమంత్రి అమీర్, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్పూర్‌లు ప్రాణాలు కోల్పోయారు.


భారత్ అప్రమత్తం

ఉద్రిక్తతల దృష్ట్యా 44 విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. యూరప్‌,యూఎస్, కెనడా నగరాలను అనుసంధానించే విమానాలు రద్దు చేసింది. ఎయిరిండియాతో పాటు ఇండిగో కూడా పలు విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇరాన్‌ సహా 11 దేశాల గగనతలాలపై ప్రయాణించొద్దని డీజీసీఏ సూచించింది.


ఇవి కూడా చదవండి

చేరుకునే దారి లేకే చేజారిన ప్రాణాలు

ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం

Updated Date - Mar 01 , 2026 | 07:50 AM