Share News

యూఏఈ అల్యూమినియం పరిశ్రమ ధ్వంసం

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:23 AM

తమ దేశంలోని ఉక్కు పరిశ్రమలు, అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిస్పందనగా గల్ఫ్‌ దేశాల్లోని మౌలిక సదుపాయాలను ఇరాన్‌ లక్ష్యంగా...

యూఏఈ అల్యూమినియం పరిశ్రమ ధ్వంసం

  • ఐదుగురు భారతీయులు సహా ఆరుగురికి గాయాలు

వాషింగ్టన్‌/దుబాయ్‌, మార్చి 28: తమ దేశంలోని ఉక్కు పరిశ్రమలు, అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిస్పందనగా గల్ఫ్‌ దేశాల్లోని మౌలిక సదుపాయాలను ఇరాన్‌ లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్‌ దాడులతో అబుధాబిలోని యూఏఈ ప్రభుత్వ ‘ఎమిరేట్స్‌ గ్లోబల్‌ అల్యూమినియం’ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిని, ఉత్పత్తి నిలిచిపోయింది. అక్కడ ఐదుగురు భారతీయులు, ఒక పాకిస్థానీ గాయపడ్డారు. మరోవైపు, ఇరాన్‌ నౌకాదళ ఆయుధ తయారీ కేంద్రాన్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో ముగ్గురు జర్నలిస్టులు మృతిచెందారు. ఒమన్‌లోని సలాలా పోర్టుపై ఇరాన్‌ డ్రోన్‌ దాడి చేసింది. దీనితో 48 గంటల పాటు పోర్టును మూసివేస్తున్నట్టు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇక ఒమన్‌ సలాలా పోర్టుకు సమీపంలో అమెరికా మిలిటరీ సహాయక నౌకపై దాడి చేసినట్టు ఐఆర్‌జీసీ తెలిపింది. దుబాయ్‌లో 500 మంది అమెరికా సైనికులు ఉన్న రెండు ప్రాంతాలపై దాడి చేశామని.. చాలా మంది సైనికులు మృతిచెందారని ఐఆర్‌జీసీ ప్రకటించింది. దీనిని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఖండించింది సౌదీ అరేబియాలోని ప్రిన్స్‌ సుల్తాన్‌ ఎయిర్‌బే్‌సపై ఏకకాలంలో ఒక క్షిపణి, పలు డ్రోన్లతో దాడి జరిగిందని 12 మంది అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారని రాయిటర్స్‌ వార్తాసంస్థ వెల్లడించింది. ఒక ఈ-3 అవాక్స్‌ విమానం, పలు ట్యాంకర్‌ విమానాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా, ఇరాన్‌ ఫార్స్‌ ప్రావిన్స్‌లో అమెరికాకు చెందిన ఎఫ్‌-16 ఫైటర్‌ను తమ ఎయిర్‌ డిఫెన్స్‌ క్షిపణి ఢీకొట్టిందని ఐఆర్‌జీసీ తెలిపింది.

ఇవి కూడా చదవండి...

సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు

అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 29 , 2026 | 06:23 AM