Share News

హోర్ముజ్‌లో సీ మైన్స్‌ తగిలి పేలిన 4చమురు నౌకలు: ఇరాన్‌ ప్రకటన

ABN , Publish Date - Oct 31 , 2026 | 05:30 AM

హోర్ముజ్‌ జలసంధి నుంచి వెళ్తూ సముద్రంలోని మందుపాతరలు(సీ మైన్స్‌) తగిలి నాలుగు చమురు ట్యాంకర్లు పేలిపోయాయని ఇరాన్‌ వెల్లడించింది.

హోర్ముజ్‌లో సీ మైన్స్‌ తగిలి పేలిన 4చమురు నౌకలు: ఇరాన్‌ ప్రకటన

న్యూఢిల్లీ, అక్టోబరు 30: హోర్ముజ్‌ జలసంధి నుంచి వెళ్తూ సముద్రంలోని మందుపాతరలు(సీ మైన్స్‌) తగిలి నాలుగు చమురు ట్యాంకర్లు పేలిపోయాయని ఇరాన్‌ వెల్లడించింది. సముద్రంలోని మందుపాతరలు అన్నింటినీ తొలగించామని అమెరికా ప్రకటించిన మరుసటి రోజే ఇరాన్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. నౌకలు తాము నిర్దేశించిన మార్గంలోనే వెళ్లాలని ఇరాన్‌ తెలిపింది.

పేలిపోయిన నాలుగు నౌకల్లో మూడు హోర్ముజ్‌లోకి రాగానే వాటిల్లో రాడార్లను, నావిగేషన్‌ వ్యవస్థలను స్విచ్ఛాప్‌ చేసినట్లు తాము గుర్తించామని, అవి హెచ్చరికలను కూడా పట్టించుకోలేదని ఇరాన్‌ నౌకాదళం తెలిపింది. మరో నౌక నేరుగా సీ మైన్స్‌ తాకి కాలిపోయిందని పేర్కొంది. అయితే, ఈ నౌకలు ఏ దేశాలకు చెందినవి, ఏ దేశాలకు చెందిన జెండాలతో ప్రయాణిస్తున్నవి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నవి, అందులోని సిబ్బంది పరిస్థితి ఏంటి.. అన్న వివరాలేవీ ఇరాన్‌ వెల్లడించలేదు.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 05:32 AM