Share News

సముద్రంలో చమురు పారబోస్తున్న ఇరాన్‌?

ABN , Publish Date - May 11 , 2026 | 06:14 AM

అమెరికా దిగ్బంధం కారణంగా చమురును అమ్ముకోలేకపోతున్న ఇరాన్‌.. దానిని సముద్రంలో పారబోస్తోందా? చమురు బావుల్లో ఉత్పత్తి నిలిపివేయలేక, నిల్వ సదుపాయాలన్నీ...

సముద్రంలో చమురు పారబోస్తున్న ఇరాన్‌?

దుబాయ్‌, మే 10: అమెరికా దిగ్బంధం కారణంగా చమురును అమ్ముకోలేకపోతున్న ఇరాన్‌.. దానిని సముద్రంలో పారబోస్తోందా? చమురు బావుల్లో ఉత్పత్తి నిలిపివేయలేక, నిల్వ సదుపాయాలన్నీ నిండిపోవడంతో ఈ చర్యకు పాల్పడుతోందా? ఉపగ్రహ చిత్రాలను విశ్లేషిస్తూ ఈ మేరకు వార్తలు వెలువడుతున్నాయి. ఇరాన్‌ చమురు ఎగుమతులు చేసే ఖార్గ్‌ దీవి సమీపంలో భారీగా నల్లటి తెట్టు తేలుతున్నట్టుగా కనబడుతుండటం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఇరాన్‌ రోజూ సుమారు 30 లక్షల బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తి చేస్తుంది. దానిని హోర్ముజ్‌ మీదుగానే విదేశాలకు ఎగుమతి చేస్తుంటుంది. యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్‌ జలసంధిని మూసేసినా తమ చమురు నౌకలను మాత్రం తరలిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు జలసంధి బయట గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ ప్రాంతంలో అమెరికా నావికాదళం దిగ్బంధం విధించింది. ఇరాన్‌కు చెందిన చమురు, ఇతర నౌకలేవీ బయటికి వెళ్లకుండా అడ్డుకుంటోంది. దీనితో ఉత్పత్తి అయిన చమురును ఇరాన్‌ వీలైనన్ని చోట్ల నిల్వ చేస్తూ వచ్చింది. అన్నీ పూర్తిగా నిండిపోయినట్టు అంచనా. అలాగని చమురు ఉత్పత్తి ఆపేసేందుకు వీలుండదు. అందుకే ఇరాన్‌ చమురును ఇరాన్‌ పర్షియన్‌ గల్ఫ్‌లో పారబోస్తూ, ఉత్పత్తి చేస్తూ ఉండవచ్చని పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

ఈ వార్తలు కూడా చదవండి...

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం

సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 11 , 2026 | 06:24 AM