Share News

చర్చలకు ముందుకొచ్చిన ఇరాన్‌

ABN , Publish Date - May 02 , 2026 | 05:54 AM

యుద్ధం ముగించే దిశగా ఇరాన్‌ కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. హోర్ముజ్‌ జలసంధి దిగ్బంధంతో ఇబ్బందులు...

చర్చలకు ముందుకొచ్చిన ఇరాన్‌

  • ఆ ప్రతిపాదనలు నచ్చలేదన్న ట్రంప్‌

ఇస్లామాబాద్‌, మే 1: యుద్ధం ముగించే దిశగా ఇరాన్‌ కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. హోర్ముజ్‌ జలసంధి దిగ్బంధంతో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో అమెరికాతో చర్చలకు సిద్ధమైంది. దీనిపై మధ్యవర్తి పాకిస్థాన్‌ ద్వారా అమెరికాకు తాజాగా ప్రతిపాదనలు పంపింది. ఇరాన్‌ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ శుక్రవారం ఈ వివరాలు వెల్లడించింది. అయితే ఎలాంటి ప్రతిపాదనలు పంపారు, ఏమేం షరతులు పెట్టారు, చర్చలు ఎక్కడ జరపనున్నారనే వివరాలేవీ వెల్లడించలేదు. అయితే తాజాగా ఇరాన్‌ చేసిన ప్రతిపాదనలు తనకు నచ్చలేదని, తాను అంగీకరించే అవకాశం లేని ప్రతిపాదనలు చేశారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఇరాన్‌ ప్రతినిధులతో ఫోన్‌లో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇరాన్‌లో కీలక నాయకత్వం అంతా తుడిచిపెట్టుకుపోయిందని, ప్రభుత్వాధినేత ఎవరో వారికే తెలియని గందరగోళం నెలకొందని వ్యాఖ్యానించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

నేను సీఎం కావాలన్నా.. కుర్చీ ఖాళీగా లేదు

జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..

Read Latest Telangana News and National News

Updated Date - May 02 , 2026 | 05:54 AM