ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్.. హైఫా పోర్ట్‌పై డ్రోన్ల దాడి
ABN , Publish Date - Mar 27 , 2026 | 06:39 AM
ఇజ్రాయెల్ మీద ఇరాన్ విరుచుకుపడింది. కీలకమైన హైఫా పోర్ట్‌పై డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడి చేసింది. నౌకాదళ మరమ్మత్తు కేంద్రాలు, లాజిస్టిక్స్ విభాగాలు, భారీ ఇంధన నిల్వ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఇరాన్ డ్రోన్ సామర్థ్యం తగ్గిందన్న అమెరికా-ఇజ్రాయెల్ వాదనలకు ఈ దాడి సమాధానమని ఇరాన్ ప్రకటించింది.
ఆంధ్రజ్యోతి, మార్చి 27: ఇజ్రాయెల్ మీద ఇరాన్ విరుచుకుపడింది. కీలకమైన హైఫా పోర్ట్‌పై డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడి చేసింది. నౌకాదళ మరమ్మత్తు కేంద్రాలు, లాజిస్టిక్స్ విభాగాలు, భారీ ఇంధన నిల్వ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిపింది. ఇరాన్ డ్రోన్ సామర్థ్యం తగ్గిందన్న అమెరికా-ఇజ్రాయెల్ వాదనలకు ఈ దాడి సమాధానమని కూడా ఇరాన్ ప్రకటించింది. మరోవైపు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై 82వ విడత ప్రతీకార దాడులను ప్రారంభించింది.
హైఫా పోర్ట్‌తో పాటు డెడ్ సీ (Dead Sea) సమీపంలోని ఇజ్రాయెల్ అణు కార్యక్రమాలకు సంబంధించిన పరిశ్రమలు, సైనిక కమాండ్ సెంటర్లపై దాడులు జరిపినట్లు IRGC వెల్లడించింది. ఈ విడతలో వివిధ రకాల క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లను (Suicide Drones) ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ భూభాగంపై భూతల దాడికి (Ground Operation) ప్రయత్నిస్తే, అమెరికా-ఇజ్రాయెల్ దళాలకు నరకం చూపిస్తామని IRGC తీవ్రంగా హెచ్చరించింది.
ఇజ్రాయెల్ వైపు నుండి అందుతున్న సమాచారం ప్రకారం, హైఫా రిఫైనరీ కాంప్లెక్స్ వద్ద మంటలు చెలరేగాయి. విద్యుత్ సరఫరాకు స్వల్ప అంతరాయం కలిగినా, పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి. ఈ దాడుల వల్ల హైఫా పోర్ట్ కార్యకలాపాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న ఈ పోర్ట్ వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్‌కు ఎంతో కీలకం.
ఇవి కూడా చదవండి:
ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్
PL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..