మా ఆస్తులను విడుదల చేస్తేనే యుద్ధానికి ముగింపు.. అమెరికా ముందు ఇరాన్ డిమాండ్..
ABN , Publish Date - May 11 , 2026 | 09:41 PM
పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ముందు ఉంచిన తన కీలక డిమాండ్లను ఇరాన్ బహిరంగంగా వెల్లడించింది.
పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ముందు ఉంచిన తన కీలక డిమాండ్లను ఇరాన్ బహిరంగంగా వెల్లడించింది. విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని, సముద్ర దిగ్బంధాన్ని ఎత్తివేయాలని, పశ్చిమాసియా దేశాల్లో యుద్ధాన్ని పూర్తిగా ఆపాలని తాము కోరినట్టు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది (Iran demands release of assets).
'యుద్ధం ఆపేందుకు మేం ఎలాంటి రాయితీలను అడగలేదు. ఇరాన్‌కు చట్టబద్ధంగా దక్కాల్సిన హక్కుల గురించే అడిగాం' అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ అన్నారు. అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు, చమురు ఎగుమతులపై పరిమితులు, విదేశీ బ్యాంకుల్లో నిలిపివేసిన బిలియన్ల డాలర్ల నిధులు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన అన్నారు (US Israel Iran conflict).
కాగా, ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నియంత్రించకపోతే ఎలాంటి ఒప్పందమూ ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు (Donald Trump Iran). ఇరాన్ పంపిన ప్రతిపాదనలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని చెప్పి తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఈ ఇరు దేశాల మధ్య తాజాగా జరిగిన శాంతి చర్చలు కూడా విఫలమయ్యాయి.
ఇవి కూడా చదవండి..
విజయ్ ప్రమాణ స్వీకారంలో ముందుగా వందేమాతరం.. ప్రతిపక్షాల ఆగ్రహం..
పాక్ ఆర్మీ చీఫ్ చెప్పినవన్నీ అబద్దాలే.. బయటపడిన అసలు నిజం..