Share News

'ఎక్కువ ట్వీట్లు.. ఎక్కువ మాటలు'.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద ఇరాన్ మంత్రి వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 18 , 2026 | 07:46 PM

'ఎక్కువ ట్వీట్లు.. ఎక్కువ మాటలు'.. ట్రంప్ చేసే సోషల్ మీడియా పోస్ట్‌లు, ఆయన ఇచ్చే ప్రకటనలు చాలా అయోమయంగా, పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఇరాన్ మంత్రి ఖతీబ్‌జాదే ఎద్దేవా చేశారు.

'ఎక్కువ ట్వీట్లు.. ఎక్కువ మాటలు'.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద ఇరాన్ మంత్రి వ్యాఖ్యలు
Iran Criticizes Donald Trump Over Confusing Tweets

టెహ్రాన్, ఏప్రిల్ 17: 'ఎక్కువ ట్వీట్లు.. ఎక్కువ మాటలు'.. ట్రంప్ చేసే సోషల్ మీడియా పోస్ట్‌లు, ఆయన ఇచ్చే ప్రకటనలు చాలా అయోమయంగా, పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఇరాన్ మంత్రి ఖతీబ్‌జాదే ఎద్దేవా చేశారు. 'అమెరికా వైపు నుంచి ట్వీట్లు ఎక్కువ, మాటలు ఎక్కువ.. అవి కొన్నిసార్లు కన్ఫ్యూజింగ్‌గా ఉంటున్నాయి' అని ఆయన వ్యాఖ్యానించారు. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) దిగ్బంధం చేయడంపై ట్రంప్ స్పందిస్తూ.. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే మళ్ళీ 'బాంబుల వర్షం' కురిపిస్తామని హెచ్చరించిన సంగతి తెలసిందే. దీనిపై ఇరాన్ మంత్రి తీవ్రంగా స్పందించారు.


అమెరికా తన మొండి వైఖరిని వీడనంత వరకు ముఖాముఖి చర్చలకు తాము సిద్ధంగా లేమని ఇరాన్ మంత్రి ఖతీబ్‌జాదే స్పష్టం చేశారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదని, తమ దేశాన్ని చివరి సైనికుడి వరకు పోరాడి రక్షించుకుంటామని ఖతీబ్‌జాదే పేర్కొన్నారు. కాగా, ఇజ్రాయెల్, హెజ్‌బుల్లా మధ్య 10 రోజుల కాల్పుల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్ ఈ జలసంధిని తెరిచింది. అయితే, ట్రంప్ చేస్తున్న ప్రకటనలకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 24 గంటలు గడవకముందే మళ్లీ జలసంధి దగ్గర ఆంక్షలు విధించింది.


ఇవి కూడా చదవండి

కేఎల్ రాహుల్, స్టబ్స్ హాఫ్ సెంచరీలు.. ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

నారీ శక్తికి కాంగ్రెస్ ద్రోహం చేసింది.. మహేశ్వర్ రెడ్డి ధ్వజం

Updated Date - Apr 18 , 2026 | 08:08 PM