హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్.. వాణిజ్య నౌకలకు హెచ్చరిక..
ABN , Publish Date - Jul 12 , 2026 | 07:46 AM
అమెరికా జోక్యాన్ని నిరసిస్తూ హోర్ముజ్ జలసంధిని మరుసటి నోటీసు వచ్చే వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తమ అనుమతి లేని మార్గాల్లో వచ్చే ఏ నౌకనైనా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం విఫలం అవ్వటంతో.. హోర్ముజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్దిరోజుల నుంచి వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తమ అనుమతి లేకుండా జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే సైప్రస్ జెండా ఉన్న వాణిజ్య నౌకపై ఐఆర్‌జీసీ దాడి చేసింది. దీంతో అమెరికా ఆగ్రహానికి గురైంది. యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్, సిరిక్, కేష్మ్ ద్వీపాలలో వైమానిక దాడులు చేసింది.
అమెరికా దాడుల నేపథ్యంలో ఐఆర్‌జీసీ కీలక ప్రకటన చేసింది. అమెరికా జోక్యాన్ని నిరసిస్తూ హోర్ముజ్ జలసంధిని మరుసటి నోటీసు వచ్చే వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తమ అనుమతి లేని మార్గాల్లో వచ్చే ఏ నౌకనైనా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఇరాన్ చేసిన ప్రకటనపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, నౌకలపై దాడులు చేయబోమని హామీ ఇస్తూ 24 గంటల్లో అధికారిక ప్రకటన చేయాలని ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
రహస్యంగా కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలు ఇవే.!
వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే.?