Share News

రహస్యంగా కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలు ఇవే.!

ABN , Publish Date - Jul 12 , 2026 | 07:29 AM

కొలెస్ట్రాల్‌ను పెంచేది కేవలం నూనె, కొవ్వు పదార్థాలే కాదు. ఆరోగ్యకరంగా కనిపించే కొన్ని ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా నిశ్శబ్దంగా చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను పెంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని అధికం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రహస్యంగా కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలు ఇవే.!
Cholesterol Increasing Foods

ఇంటర్నెట్ డెస్క్: గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం చాలా ముఖ్యం. అయితే చాలామంది కేవలం నూనె, కొవ్వు పదార్థాలే కొలెస్ట్రాల్‌ను పెంచుతాయని భావిస్తారు. కానీ ఆరోగ్యకరంగా కనిపించే కొన్ని ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక కొలెస్ట్రాల్‌కు సాధారణంగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ కాలక్రమంలో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.


ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాసెస్ చేసిన మాంసం, బేకరీ ఉత్పత్తులు, డీప్ ఫ్రై చేసిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, క్రీమ్, వెన్న, అధిక చీజ్, ప్యాక్ చేసిన స్నాక్ ఫుడ్స్ వంటి వాటిలో సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. సాసేజ్‌లు, బేకన్, సలామీ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలను తరచుగా తినడం గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే బిస్కెట్లు, కేకులు.. చక్కెర ఉండటం వల్ల కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది.


ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, పకోడీలు వంటి డీప్ ఫ్రై చేసిన పదార్థాలను పదేపదే వేడి చేసిన నూనెల్లో తయారు చేయడం వల్ల అవి మరింత హానికరంగా మారుతాయి. క్రీమ్‌తో చేసిన కూరలు, వెన్న, అధిక చీజ్ కూడా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అలాగే బంగాళాదుంప చిప్స్, ఫ్లేవర్డ్ క్రాకర్స్ వంటి ప్యాక్ చేసిన స్నాక్స్‌లో ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి హానికరం.

వీటికి బదులుగా చికెన్, చేపలు, పప్పుధాన్యాలు, బీన్స్, వేయించిన శనగలు, డ్రైఫ్రూట్స్, తాజా పండ్లు, ఇంట్లో తయారుచేసిన పాప్‌కార్న్, తక్కువ కొవ్వు ఉన్న పెరుగు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం మంచిది. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?

ఈ తేదీల్లో పుట్టినవారిది రాజసమైన వ్యక్తిత్వం..!

Updated Date - Jul 12 , 2026 | 07:29 AM