Share News

పాకిస్థాన్ నెం.1.. భారత్ నెం.6.. అత్యంత కాలుష్యకారక దేశాల జాబితా ఇదే..

ABN , Publish Date - Mar 24 , 2026 | 06:01 PM

ఆసియా దేశాలు అత్యంత కాలుష్య కారక ప్రాంతాలుగా మారుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత కాలుష్య కారక దేశంగా పాకిస్థాన్ నిలిచింది. వాయు నాణ్యతను పర్యవేక్షించే స్విట్జర్లాండ్ సంస్థ ఐక్యూ ఎయిర్ మంగళవారం కాలుష్య కారక దేశాల జాబితాను ప్రకటించింది.

పాకిస్థాన్ నెం.1.. భారత్ నెం.6.. అత్యంత కాలుష్యకారక దేశాల జాబితా ఇదే..
IQAir pollution report

ఆసియా దేశాలు అత్యంత కాలుష్యకారక ప్రాంతాలుగా మారుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య కారక దేశంగా పాకిస్థాన్ తొలి స్థానంలో నిలిచింది. వాయు నాణ్యతను పర్యవేక్షించే స్విట్జర్లాండ్ సంస్థ 'ఐక్యూ ఎయిర్' మంగళవారం కాలుష్య కారక దేశాల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో పాకిస్థాన్ తర్వాత వరుసగా బంగ్లాదేశ్, తజికిస్థాన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో భారత్ ఆరో స్థానంలో ఉంది ( Pakistan air quality crisis).


మొత్తం 143 దేశాల్లో వాయు నాణ్యతా పరీక్షలు నిర్వహించగా, వాటిల్లో 130 దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన వాయు నాణ్యతా ప్రమాణాల అమలులో విఫలమయ్యాయి (IQAir pollution report). పాకిస్థాన్‌లో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరంగా ఉందని, అక్కడి ప్రజలు శ్వాస సమస్యలతో సతమతమవుతున్నారని 'ఐక్యూఎయిర్' తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన పరిమితి కంటే ప్రమాదకర పీఎం (పార్టిక్యులేట్ మ్యాటర్) 2.5 కణాల స్థాయిలు పాక్‌లో 13 రెట్లు అధికంగా ఉన్నట్టు పేర్కొంది.


ఇక, ప్రపంచంలోని అత్యంత కాలుష్యం వెలువరించే నగరాల జాబితాలో ఢిల్లీకి సమీపంలోని 'లోని' నగరం మొదటి స్థానంలో ఉంది (Loni Uttar Pradesh pollution). ఇక్కడ, సగటు పీఎం 2.5 సాంద్రత క్యూబిక్ మీటర్‌కు 112.5 మైక్రోగ్రాములుగా ఉంది. 'లోని' తర్వాతి స్థానంలో చైనాలోని హోటన్ నగరం అత్యంత కాలుష్యం వెలువరించే నగరంగా నిలిచింది. ప్రపంచంలోని అత్యంత కాలుష్యం వెలువరించే 25 నగరాల్లో మొత్తం అన్నీ భారత్, పాక్, చైనాల్లోనే ఉండడం గమనార్హం.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ యుద్ధం.. రంగంలోకి సౌదీ అరేబియా, యూఏఈ..


వరుస నష్టాలకు బ్రేక్ .. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..

Updated Date - Mar 24 , 2026 | 06:01 PM